Hyderabad : ‘సూత్రధారి’ దొరికాడు.. 127 మందికి ఆధార్ నోటీసులు..

నకిలీ ఆధార్‌లు ఉన్నాయని హైదరాబాద్‌కి చెందిన 127 మందికి.. ఉడాయ్ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ-యూఐడీఏఐ) సంస్థ నోటీసులు జారీ చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఇష్యూలో నిజాలు ఒక్కొక్కటిగా బటయకి వస్తున్నాయి.  127 మందిలో సత్తార్ ఖాన్  అనే వ్యక్తి..ఈ అక్రమాలకు పురిగొల్పిన ప్రధాన నిందితుడిగా తెలుస్తోంది. 

Hyderabad : 'సూత్రధారి' దొరికాడు.. 127 మందికి ఆధార్ నోటీసులు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 20, 2020 | 2:52 PM

Hyderabad : నకిలీ ఆధార్‌లు ఉన్నాయని హైదరాబాద్‌కి చెందిన 127 మందికి.. ఉడాయ్ (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ-యూఐడీఏఐ) సంస్థ నోటీసులు జారీ చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఇష్యూలో నిజాలు ఒక్కొక్కటిగా బటయకి వస్తున్నాయి.  127 మందిలో సత్తార్ ఖాన్  అనే వ్యక్తి..ఈ అక్రమాలకు పురిగొల్పిన ప్రధాన నిందితుడిగా తెలుస్తోంది.  రోహింగ్యా ముస్లింలకు నకిలీ పత్రాల ద్వారా ఆధార్‌లు ఇప్పించినట్టు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో సత్తార్ ఖాన్‌పై  2018లో  కేసు నమోదైంది. ఈ పద్దతి ద్వారానే అతడు ఇప్పటివరకు 127 మంది రోహింగ్యాలకు ఆధార్ నమోదు చేయించనట్టు విచారణలో బట్టబయలైంది. కేసు విచారణలో భాగంగా పోలీసులు ఆధార్ సంస్థకు లేఖ రాయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఆధార్ సంస్థ కూడా సీరియస్ అయ్యింది. సీసీఎస్ కేసులో ఉన్న నేరస్తులతో పాటు నకిలీ పేపర్‌తో ఆధార్ పొందిన మొత్తం 127 మంది రోహింగ్యాలకు నోటీసులు జారీ చేసింది. తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే డాక్యుమెంట్లతో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అలా లేని పక్షంలో ఏదేని దేశం నుంచి వలస వచ్చినట్టైనా ఆధారాలు సమర్పించాలని, లేని పక్షంలో ఆధార్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది.