లంచం అడిగిన ఎమ్మార్వోకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రైతు

లంచం అడిగిన ఎమ్మార్వోకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రైతు

భోపాల్: ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడటం మనం చూసి ఉంటాం. అలాంటి ఓ అవినీతి అధికారికి ఓ రైతు వెరైటీగా బుద్ది చెప్పాడు. తన ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ కు రైతు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. మధ్యప్రదేశ్ లోని తిక్మాఘర్ జిల్లా ఖర్గాపూర్ తహసీల్దార్ సునీల్ వర్మ ఓ రైతును అతనికి సంబంధించిన పత్రాలు ఇవ్వడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. అయితే ఆ రైతు […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 4:57 PM

భోపాల్: ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడటం మనం చూసి ఉంటాం. అలాంటి ఓ అవినీతి అధికారికి ఓ రైతు వెరైటీగా బుద్ది చెప్పాడు. తన ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ కు రైతు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. మధ్యప్రదేశ్ లోని తిక్మాఘర్ జిల్లా ఖర్గాపూర్ తహసీల్దార్ సునీల్ వర్మ ఓ రైతును అతనికి సంబంధించిన పత్రాలు ఇవ్వడానికి లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. అయితే ఆ రైతు రూ.50వేలు చెల్లిస్తానని బతిమాలాడు. కానీ ఆ రెవెన్యూ అధికారి మరో రూ.50వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. దీంతో విసిగిపోయిన ఆ రైతు చేసేదేమిలేక తన బర్రెను తహసిల్దార్ జీపుకు కట్టి వినూత్నంగా నిరసనకు దిగాడు. అక్కడి వచ్చిన ప్రజలు లక్ష్మీయాదవ్‌ పరిస్థితి చూసి సదరు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయం జిల్లా కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో.. వెంటనే ఆయన ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి మరో అధికారిని నియమించారు. ఈ దర్యాప్తులో అధికారి లంచం డిమాండ్‌ చేసినట్లు ప్రాథమికంగా తేలింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu