తల్లి శవంతో మూడు రోజులుగా ఇంట్లోనే..

ఓ ఇంట్లో మ‌హిళ చ‌నిపోయి మూడు రోజులు అవుతుంది. అయినా కానీ శవానికి అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌కుండా ఇంట్లోనే దాచిపెట్టింది ఆమె కూతురు.

తల్లి శవంతో మూడు రోజులుగా ఇంట్లోనే..

Daughter keeps body of dead Mother : ఓ ఇంట్లో మ‌హిళ చ‌నిపోయి మూడు రోజులు అవుతుంది. అయినా కానీ శవానికి అంత్య‌క్రియ‌లు జ‌ర‌ప‌కుండా ఇంట్లోనే దాచిపెట్టింది ఆమె కూతురు. స్థానికంగా క‌ల‌కలం రేపిన ఈ ఘ‌ట‌న బెంగాల్ హూగ్లీ ప్రాంతం శ్రీరామ్​పుర్​లో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే..సోనాలిరాయ్ అనే మ‌హిళ త‌ల్లి సుష్మా రాయ్(70) ఇటీవ‌ల క‌న్నుమూశారు. అయితే ఆమె శ‌వాన్ని త‌న‌య సోనాలిరాయ్ బెడ్​రూమ్​లో దాచిపెట్టారు. ఇలా 3 రోజులు గ‌డ‌వ‌డంతో ఆ ఇంటి నుంచి కుళ్లిన వాస‌న రావ‌డం మొద‌లైంది. అనుమానం వ‌చ్చిన స్థానికులు పోలీసులకు స‌మాచారమందించారు. పోలీసులు అక్క‌డికి చేరుకుని ప‌రిశీలించి.. సోనాలి తల్లి మూడు, నాలుగు రోజుల క్రితమే చనిపోయి ఉంటుందని అంచనాకు వ‌చ్చారు. సోనాలిరాయ్ ఇలా ఎందుకు చేసిందో ఇంకా క్లారిటీ రాలేదు. ఆమె మాన‌సిక ప‌రిస్థితి గురించి కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు.

 

Read More : మ‌ర్డ‌ర్ సినిమా నిర్మాత‌ల‌కు అమృత ప్ర‌ణ‌య్ నోటీసులు

Click on your DTH Provider to Add TV9 Telugu