ఆగని కార్పొ’రేటు’ దోపిడి : ఫిర్యాదులు వెల్లువ‌

కరోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. ఈ విప‌త్క‌ర‌ స‌మయంలో కార్పోరేట్ ఆస్ప‌త్రులు దోపిడికి తెర‌తీశాయి. సంద‌ర్బాన్ని వాడుకుని ప్ర‌జ‌ల నుంచి కాసులు దండుకుంటున్నాయి.

ఆగని కార్పొ'రేటు' దోపిడి : ఫిర్యాదులు వెల్లువ‌

Private hospitals over charges From Covid Treatment : కరోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. ఈ విప‌త్క‌ర‌ స‌మయంలో కార్పోరేట్ ఆస్ప‌త్రులు దోపిడికి తెర‌తీశాయి. సంద‌ర్బాన్ని వాడుకుని ప్ర‌జ‌ల నుంచి కాసులు దండుకుంటున్నాయి. ప్రభుత్వాలు హెచ్చ‌రికలు జారీ చేస్తూ..చ‌ర్య‌లు తీసుకుంటున్నా గ‌వ‌ర్నమెంట్ ఆస్ప‌త్రులు తీరుతెన్నులు మార‌డం లేదు. ప్రైవేటు ఆస్పత్రులు వేస్తున్న బిల్లులు చూసి వారి బంధువులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పటికే రెండు ఆస్పత్రులకు కరోనా చికిత్స అనుమతులు రద్దు చేసింది ప్ర‌భుత్వం. బుధవారం రోజున‌ ప్రైవేటు ఆస్పత్రుల దోపిడి దందాపై కొత్తగా మరో 24 ఫిర్యాదులు వైద్య ఆరోగ్యశాఖకు అందాయి. బుధ‌వారం వ‌ర‌కు మొత్తం 951 కంప్లైంటులు వచ్చాయి.

ఆర్టీపీసీఆర్ కు రూ.2200 ధర నిర్ణయించింది ప్ర‌భుత్వం. నిజానికి ఆర్టీపీసీఆర్ తో పోలిస్తే.. ర్యాపిడ్ టెస్టు చాలా సుల‌భ‌త‌రం. తక్కువ సమయంలో..తక్కువ ఖర్చుతో ఫ‌లితం తెలిసిపోతుంది. చెస్ట్ ఎక్సరే లో కూడా క‌రోనా ఉందో లేదో నిర్దార‌ణ అవుతుంది. కానీ సిటీలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు ఇవేవీ పట్టించుకోకుండా అవసరం లేకపోయినా ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకున్న వారందరికీ క‌రోనా నిర్ధారణ పేరుతో అడ్మిషన్‌కు ముందే సీటీస్కాన్‌లు చేయించుకోమ‌ని సూచిస్తున్నాయి. ఇందుకు ఒక్కో ఆస్పత్రి రూ.6500 నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నాయి. దీంతో సీరియ‌స్ అయిన ప్ర‌భుత్వం.. ప్ర‌ముఖ‌ ప్ర‌వేట్ ఆస్పత్రులకు కూడా నోటీసులు పంపింది. ఎంత పెద్ద ఆస్ప‌త్రులు అయినా ఈ స‌మయంలో ప్ర‌జ‌లను దోచుకోవాల‌ని చూస్తే..క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వంటుంది ప్ర‌భుత్వం.

 

Read More : యువ‌తి క‌డుపులో 1.5 కిలోల జుట్టు

Click on your DTH Provider to Add TV9 Telugu