తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!

తల్లి భారమైందని బ్రతికుండగానే.. పూడ్చిపెట్టిన దుర్మార్గుడు.!

ప్రస్తుత సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలను చూస్తుంటే.. మనం ఇలాంటి వారి మధ్య జీవిస్తున్నామా అనిపిస్తుంది. ప్రతి రోజు ఈ ప్రపంచంలో ఎన్నో ఘోరాలు గురించి వింటూ ఉంటాం. తాజాగా మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. జన్మనిచ్చిన తల్లి భారమైందని ఓ దుర్మార్గపు కొడుకు ఆమెను బ్రతికుండగానే పాతిపెట్టిన ఘటన ఉత్తర చైనాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. చైనాకు చెందిన యాన్ అనే వ్యక్తి తల్లి వాంగ్ పాక్షిక పక్షవాతంతో బాధపడుతోంది. దీనితో […]

Ravi Kiran

|

May 09, 2020 | 10:19 AM

ప్రస్తుత సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలను చూస్తుంటే.. మనం ఇలాంటి వారి మధ్య జీవిస్తున్నామా అనిపిస్తుంది. ప్రతి రోజు ఈ ప్రపంచంలో ఎన్నో ఘోరాలు గురించి వింటూ ఉంటాం. తాజాగా మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. జన్మనిచ్చిన తల్లి భారమైందని ఓ దుర్మార్గపు కొడుకు ఆమెను బ్రతికుండగానే పాతిపెట్టిన ఘటన ఉత్తర చైనాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. చైనాకు చెందిన యాన్ అనే వ్యక్తి తల్లి వాంగ్ పాక్షిక పక్షవాతంతో బాధపడుతోంది. దీనితో ఆమె చాలా కాలంగా మంచానికే పరిమితం అయింది. ఆ కారణంగా ఆమెకు సపర్యలు చేస్తూ సంరక్షణ చూసుకోవడం భారంగా భావించాడు. దీనితో యాన్ తన తల్లిని ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే మే రెండో తేదిన చక్రాల బండిపై ఆమెను బయటికి తీసుకెళ్ళి చేయాల్సిన పనిని పూర్తి చేశాడు. ఇక మూడు రోజులు గడుస్తున్నా ఆమె ఇంటికి రాకపోవడంతో.. అతని భార్యకు భర్తపై అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించింది.

దీనితో రంగంలోకి దిగిన పోలీసులు యాన్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. తన తల్లి భారంగా మారడంతో ఆమెను బ్రతికుండగానే పూడ్చి పెట్టేశానని నిజం ఒప్పుకున్నాడు. ఇక పోలీసులు హుటాహుటిన అతను పాతిపెట్టిన స్థలానికి వెళ్లగా అంతటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ సమాధిలో నుంచి ఆమె నీరసంగా సాయం కోసం అర్ధించడం వినిపించింది. వెంటనే పోలీసులు ఆ ప్రదేశాన్ని తవ్వి ఆమెను రక్షించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More:

ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే సచివాలయాల్లో 16, 208 పోస్టులు భర్తీ!

‘సార్ మేము చనిపోతున్నాం’.. గ్యాస్ లీకేజ్ ఘటన బాధితుడు ఫోన్.!

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

గుడ్ న్యూస్.. టెన్త్ పరీక్షలు లేకుండానే.. పై తరగతులకు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu