సంపన్నుల జాబితాలో హైదరాబాద్ ఫార్మా దిగ్గజాలు.. గ్లోబల్ బిలియనీర్ క్లబ్‌లో 10 మందికి చోటు.. ఎవరెవరంటే..

Global Billionaire Club : హురూన్ అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో ఫార్మా దిగ్గజాలు హవా సృష్టించారు. హైదరాబాద్ నుంచి మొత్తంగా 10 మంది సంపన్నులకు

సంపన్నుల జాబితాలో హైదరాబాద్ ఫార్మా దిగ్గజాలు.. గ్లోబల్ బిలియనీర్ క్లబ్‌లో 10 మందికి చోటు.. ఎవరెవరంటే..
Follow us

|

Updated on: Mar 03, 2021 | 6:36 PM

Global Billionaire Club : హురూన్ అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో ఫార్మా దిగ్గజాలు హవా సృష్టించారు. హైదరాబాద్ నుంచి మొత్తంగా 10 మంది సంపన్నులకు చోటు దక్కితే.. అందులో ఏడుగురు ఫార్మా దిగ్గజాలే. ఆ ఏడుగురి సంపద రూ.1,65,900 కోట్లు. ప్రపంచ సంపన్నుల జాబితాను హురూన్ విడుదల చేసింది. మన దేశానికి సంబంధించి జాబితాలో ముంబై నుంచి 60 మంది కోటీశ్వరులు, ఢిల్లీ నుంచి 40, బెంగళూరు నుంచి 22, అహ్మదాబాద్ నుంచి 11 మంది కోటీశ్వరులు చోటు సంపాదించారు. 10 మంది సంపన్నులతో హైదరాబాద్ ఐదో స్థానంలో ఉంది. ప్రపంచ జాబితాలో 1,058 మందితో చైనా ముందుంది. మన దేశం నుంచి 209 మంది కోటీశ్వరులు జాబితాలో చోటు దక్కించుకున్నారు.

కాగా, హైదరాబాద్ కు సంబంధించి రూ.54,100 కోట్ల సంపదతో మురళీ దివి మొదటి స్థానంలో నిలిచారు. దేశంలో ఆయన సంపన్న ర్యాంకు 20 కాగా.. ప్రపంచంలో 385. 22,600 కోట్లతో దేశంలో 56వ స్థానంలో ఉన్న అరబిందో ఫార్మా అధిపతి పీవీ రాంప్రసాద్ రెడ్డి.. ప్రపంచ జాబితాలో 1,096వ ర్యాంకును సాధించారు. వారితో పాటు మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పి పిచ్చి రెడ్డి, మై హోం ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, మేఘా ఇంజనీరింగ్ కు చెందిన పీవీ కృష్ణారెడ్డిలు జాబితాలో చోటు సంపాదించారు. జాబితాలో హైదరాబాదీ సంపన్నుల ర్యాంకులు ఈ విధంగా ఉన్నాయి.

1.మురళీ దివి: దివీస్ ల్యాబ్స్– రూ.54,100 కోట్లు, దేశంలో ర్యాంకు 20, ప్రపంచ ర్యాంకు 385 2.పీవీ రాంప్రసాద్ రెడ్డి: అరబిందో ఫార్మా– రూ.22,600 కోట్లు, దేశ ర్యాంకు 56, ప్రపంచ ర్యాంకు 1,096 3.బి. పార్థసారథి రెడ్డి: హెటిరో డ్రగ్స్– రూ.16,000 కోట్లు, దేశ ర్యాంకు 83, ప్రపంచ ర్యాంకు 1,609 4.కె. సతీశ్ రెడ్డి: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్– రూ.12,800 కోట్లు, దేశ ర్యాంకు 108, ప్రపంచ ర్యాంకు 2,050 5.జీవీ ప్రసాద్, జీ అనురాధ: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్– రూ.10,700 కోట్లు, దేశ ర్యాంకు 133, ప్రపంచ ర్యాంకు 2,238 6.పి. పిచ్చిరెడ్డి: మేఘా ఇన్ ఫ్రాస్ట్రక్చర్– రూ.10,600 కోట్లు, దేశ ర్యాంకు 134, ప్రపంచ ర్యాంకు 2,383 7.జూపల్లి రామేశ్వరరావు: మై హోం ఇండస్ట్రీస్– రూ.10,500 కోట్లు, దేశ ర్యాంకు 138, ప్రపంచ ర్యాంకు 2,383 8.పీవీ కృష్ణారెడ్డి: మేఘా ఇంజనీరింగ్– రూ.10,400 కోట్లు, దేశ ర్యాంకు 140, ప్రపంచ ర్యాంకు 2,383 9.ఎం. సత్యనారాయణ రెడ్డి: ఎంఎస్ఎన్ ల్యాబ్స్– రూ.9,800 కోట్లు, దేశ ర్యాంకు 143, ప్రపంచ ర్యాంకు 2,530 10.వీసీ నన్నపనేని: నాట్కో ఫార్మా– రూ.8,600 కోట్లు, దేశ ర్యాంకు 164, ప్రపంచ ర్యాంకు 2,686

నిరుద్యోగులకు శుభవార్త.. హెచ్‌పీసీఎల్ నుంచి అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్.. చివరి సంవత్సరం విద్యార్థులూ అర్హులే..

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.