Local Body Election : తొలి విడతలో 517 పంచాయతీలు ఏకగ్రీవం.. ఎన్నికలు జరగాల్సిన గ్రామపంచాయతీలు ఎన్నంటే..

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 3,249 గ్రామపంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరగాల్సి ఉండగా 517 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకంగా 20 శాతం ఏకగ్రీవాలు జరిగాయి.

Local Body Election : తొలి విడతలో 517 పంచాయతీలు ఏకగ్రీవం.. ఎన్నికలు జరగాల్సిన గ్రామపంచాయతీలు ఎన్నంటే..
Follow us

|

Updated on: Feb 05, 2021 | 8:28 PM

Local Body Election First Phase : ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 3,249 గ్రామపంచాయతీలకు తొలి విడతలో ఎన్నికలు జరగాల్సి ఉండగా 517 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకంగా 20 శాతం ఏకగ్రీవాలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో తొలి దశలో 454 పంచాయతీలకు 112 ఏకగ్రీవమయ్యాయి. అంటే 24 శాతం పంచాయతీల్లో ఏకగ్రీవాలు జరిగాయి. గుంటూరు జిల్లాలో 337 పంచాయతీలకు 67 ఏకగ్రీవమయ్యాయి.

అంటే దాదాపు 20 శాతం ఏకగ్రీవాలు జరిగాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు జరగడాన్ని అనుమానించిన ఎస్ఈసీ దీనికో కొత్త ట్విస్ట్ ఇచ్చింది. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై వెంటనే నిర్ణయం తీసుకోవద్దని కలెక్టర్లను ఆదేశించింది. ప్రతి పంచాయతీపై పూర్తి స్థాయిలో నివేదిక వచ్చాక నిర్ణయం ఉంటుందని సీఈసీ తెలిపింది. మళ్లీ ఆదేశించే వరకు ఫలితాలు ప్రకటించవద్దని స్పష్టంగా చెప్పింది.

ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ణయంతో వైసీపీ నేతలకు మండుకొచ్చింది. ఏకగ్రీవాలు అడ్డుకోవాలని రాజ్యాంగంలో ఎక్కడైనా నిబంధన ఉందా అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్. గ్రామస్తులు కలిసి నిర్ణయం తీసుకుంటే SECకి అభ్యంతరం ఏంటన్నారాయన.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చంద్రబాబు మెప్పు కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి. ఆయన ఆదేశాలు పాటించి ఏకగ్రీవంగా ఎన్నికైన వారికి డిక్లరేషన్ ఫారమ్‌లు ఇవ్వకపోతే ఎన్నికల తర్వాత ఆ అధికారులు అందరిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

ఏం చేసైనా ఏకగ్రీవాలు సాధించాలని అధిష్ఠానం ఇచ్చిన టార్గెట్ కోసం వైసీపీ నేతలు ఎంతకైనా తెగిస్తున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ఎలాంటి నేరం చేసైనా ఏకగ్రీవం సాధించాలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పని చేస్తున్నారని అన్నారు.

తన ప్రతి నిర్ణయంతో సంచలనం సృష్టిస్తూ వస్తున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ఇప్పుడు ఈ తాజా ఆదేశాలతో మరోసారి వైసీపీ నేతలకు టార్గెట్‌గా మారారు. ఈ ఎన్నికల పంచాయితీ పూర్తయ్యే వరకు నిమ్మగడ్డ సెంటరాఫ్‌ ఎలక్షన్‌గానే ఉండబోతున్నారు.

ఇవి కూడా చదవండి :

Share Market News Today : స్టాక్‌ మార్కెట్లో బడ్జెట్‌ ర్యాలీ.. ఐదవ రోజు కొనసాగిన బుల్ జోష్..

Budget Session : అసెంబ్లీ చరిత్రలో సంచలనం.. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు..!

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..