ఆఫ్ఘన్ దళాల ఆపరేషన్.. ఐదుగురు తాలిబన్‌ ఉగ్రవాదులు హతం..

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా జాబుల్‌ పరిసరాల్లో ఆఫ్ఘన్ దళాలకు, తాలిబన్లకు మద్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు తాలిబన్ల హతమయ్యారు. మరో నలుగురు తాలిబన్లు గాయపడ్డారు. జాబుల్‌లోని ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జాబుల్ ప్రావిన్స్‌లో తాలిబన్లు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆఫ్ఘన్ దళాలు ఆపరేషన్‌కు సిద్ధమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఆఫ్ఘన్ దళాలు.. జాబుల్ ప్రాంతంలో ప్రవేశించడంతో.. తాలిబన్లు భద్రతా బలగాలపైకి దాడికి […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:36 pm, Wed, 22 April 20
ఆఫ్ఘన్ దళాల ఆపరేషన్.. ఐదుగురు తాలిబన్‌ ఉగ్రవాదులు హతం..

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా జాబుల్‌ పరిసరాల్లో ఆఫ్ఘన్ దళాలకు, తాలిబన్లకు మద్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు తాలిబన్ల హతమయ్యారు. మరో నలుగురు తాలిబన్లు గాయపడ్డారు. జాబుల్‌లోని ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జాబుల్ ప్రావిన్స్‌లో తాలిబన్లు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆఫ్ఘన్ దళాలు ఆపరేషన్‌కు సిద్ధమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఆఫ్ఘన్ దళాలు.. జాబుల్ ప్రాంతంలో ప్రవేశించడంతో.. తాలిబన్లు భద్రతా బలగాలపైకి దాడికి దిగాయి. దీంతో ఆఫ్ఘన్ దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు తాలిబన్ ఉగ్రవాదులు హతమవ్వగా.. నలుగురు గాయపడ్డారు. ఘటనాస్థలం నుంచి 10 మోటార్ సైకిళ్ళు, రెండు రేడియో స్టేషన్లు, లైట్లతో పాటు.. భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.