టీటీడీలో 743 మందికి కరోనా పాజిటివ్, ఐదుగురు మృతి

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకు 743 మందికి కరోనా బారిన ప‌డ్డార‌ని ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

టీటీడీలో 743 మందికి కరోనా పాజిటివ్, ఐదుగురు మృతి
Follow us

|

Updated on: Aug 09, 2020 | 4:35 PM

Corona Cases In Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకు 743 మంది కరోనా బారిన ప‌డ్డార‌ని ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వీరిలో దాదాపు 400 మంది వ్యాధి బారి నుంచి కోలుకుని.. నగరంలోని వివిధ‌ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. ఇంకా కోవిడ్ సెంట‌ర్ల‌లో 338 మంది చికిత్స పొందుతున్నారని వెల్ల‌డించారు. అలాగే కోవిడ్‌తో ఐదుగురు టీటీడీ ఎంప్లాయిస్ చ‌నిపోయార‌ని చెప్పారు.

ఇక జులై నెలలో శ్రీవారికి హుండీ ద్వారా రూ. 16 కోట్లు రాగా.. ఈ-హుండీ ద్వారా మ‌రో రూ. 3 కోట్లు వ‌చ్చినట్టు వివ‌రించారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వార్షిక బడ్జెట్ రూ. 3,200 కోట్లు కాగా, ఇందులో రూ. 1,350 కోట్లు కేవలం జీత‌భ‌త్యాల‌కే ఖర్చు అవుతుందన్నారు. చాలా మితంగా ఖ‌ర్చులు చేస్తున్న‌ప్ప‌టికీ ప్రస్తుతం రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు నెల‌కు ఖర్చులు అవుతున్నాయ‌ని చెప్పారు. ఇప్పటి వరకు కార్పస్ ఫండ్ నుంచి డ‌బ్బు తీసుకోలేద‌ని వెల్లడించారు. టీటీడీ బోర్డుతో చ‌ర్చించిన అనంత‌రం దీనిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. ఆగస్టు నెలాఖరు తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విడుద‌ల చేసే నిబంధనలను అనుస‌రించి స్వామివారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలా? భక్తుల భాగస్వామ్య ఉండాలా? అనే అంశంపై పాలకమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివ‌రించారు.

Read More : అల్లుడు త‌ల న‌రికి.. పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లిన మామ