Covid-19 Hospital: కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం… నలుగురు కరోనా రోగులు సజీవదహనం

Fire Breaks Out: ఛత్తీస్‌గఢ్‌లో విషాదం చోటు చేసుకుంది. కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి నలుగురు రోగులు సజీవదహనం అయ్యారు. ఫ్యాన్‌ay షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా...

  • Subhash Goud
  • Publish Date - 11:33 pm, Sat, 17 April 21
Covid-19 Hospital: కరోనా ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం... నలుగురు కరోనా రోగులు సజీవదహనం
Covid 19 Hospital

Fire Breaks Out: ఛత్తీస్‌గఢ్‌లో విషాదం చోటు చేసుకుంది. కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి నలుగురు రోగులు సజీవదహనం అయ్యారు. ఫ్యాన్‌ay షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఆస్పత్రి అంతా మంటలు వ్యాపించి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ఆస్పత్రిలో కరోనాతో ఇబ్బందులు పడుతున్న నలుగురు రోగులు మృతి చెందారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భూపేష్‌ భాగేల్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు నస్టపరిహారం ప్రకటించారు.

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లోని రాజధాని ఆస్పత్రిని కరోనా రోగుల కోసం కేటాయించారు. అయితే ఆస్పత్రిలో కోవిడ్‌ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. శనివారం ఫ్యాన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు ఆస్పత్రి అంతా చెలరేగాయి. మంటలు చెలరేగడంతో రోగులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది కూడా రోగులను బయటకు తరలించేందుకు తీవ్రంగా శ్రమించారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్లు ఎస్పీ అజయ్‌ యాదవ్‌ తెలిపారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి భూపేష్‌ భాగేల్‌.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అలాగే వారి కుటుంబాలకు రూ.4 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.

కాగా, ఈ మధ్య కాలంలో పలు కరోనా ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. సిబ్బంది నిర్లక్ష్యం, షార్ట్‌ సర్క్యూట్‌ తదితర కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగి రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ముందే కరోనాతో పోరాడుతూ ఆస్పత్రుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్లాడుతుంటే.. ఇలా అగ్ని ప్రమాదాల రూపంలో ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి: Murder: అత్తా, కోడళ్ల మధ్య గొడవ.. కన్న తల్లిని గొడ్డలితో నరికిన కుమారుడు..

ఏపీ మాజీ మంత్రి మహమ్మద్‌ జానీ కన్నుమూత… రెండు సార్లు ఎమ్మెల్యేగా, శాసన మండలిలో డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు