పాక్‌లో భారత వ్యతిరేక ర్యాలీపై గ్రేనేడ్‌ ఎటాక్‌

పాక్‌లో భారత వ్యతిరేక ర్యాలీపై గ్రేనేడ్‌ ఎటాక్‌

పాకిస్థాన్‌లో గ్రేనేడ్‌ దాడి కలకలం రేపుతోంది. దేశంలోని కరాచీ నగరంలో భారత్‌కు వ్యతిరేకంగా బుధవారం నాడు ఓ ర్యాలీ నిర్వహించారు. గుల్షన్‌-ఇ ఈక్బాల్‌ ప్రాంతంలో జమాత్-ఇ-ఇస్లామి (జేఐ) భారత వ్యతిరేక..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 07, 2020 | 2:18 AM

పాకిస్థాన్‌లో గ్రేనేడ్‌ దాడి కలకలం రేపుతోంది. దేశంలోని కరాచీ నగరంలో భారత్‌కు వ్యతిరేకంగా బుధవారం నాడు ఓ ర్యాలీ నిర్వహించారు. గుల్షన్‌-ఇ ఈక్బాల్‌ ప్రాంతంలో జమాత్-ఇ-ఇస్లామి (జేఐ) భారత వ్యతిరేక ర్యాలీ నిర్వహించింది. గతేడాది జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి ఉన్న ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ర్యాలీకి సంబంధించిన ఓ ట్రక్కుపై గ్రేనేడ్‌ విసిరి పారిపోయారు. ఈ ఘటనలో 39 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని సింధ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియా సమన్వయ కర్త మీరన్‌ యూసుఫ్‌ తెలిపారు. అయితే దాడి సమాచారం అందుకున్న వెంటనే.. సంఘటనా స్థలానకి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఇక ఈ దాడికి పాల్పడింది తామేనంటూ.. సింధ్ దేశ్‌ రెవల్యూనరీ ఆర్మీ ప్రకటించింది.

Read More :

దేశ రాజధానిలో పెరిగిన కరోనా కేసులు

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu