ఖాట్మాండుకు తెలుగు యాత్రికుల తరలింపు

మానస సరోవర్‌లో చిక్కుకున్న 40 మంది తెలుగు యాత్రికులలో 35 మందిని అధికారులు ఖాట్మాండుకు తరలించారు. ఇంకా సింకోట‌్‌లోనే ఉన్న ఐదుగురు యాత్రికులను కూడా ఖాట్మాండుకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఖాట్మాండు నుంచి నేడో, రేపో యాత్రికులు స్వస్థలాలకు రానున్నారు. హైదరాబాద్‌కి చెందిన 40 మంది తెలుగు యాత్రికులు మానస సరోవరం హిల్‌సా వద్ద వాతావరణం అనుకూలించక అక్కడే ఐదురోజులుగా ఉండిపోయారు. దీంతో.. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఐదు రోజుల నుంచి అక్కడే వారు ఇబ్బంది […]

ఖాట్మాండుకు తెలుగు యాత్రికుల తరలింపు
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2019 | 10:10 AM

మానస సరోవర్‌లో చిక్కుకున్న 40 మంది తెలుగు యాత్రికులలో 35 మందిని అధికారులు ఖాట్మాండుకు తరలించారు. ఇంకా సింకోట‌్‌లోనే ఉన్న ఐదుగురు యాత్రికులను కూడా ఖాట్మాండుకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఖాట్మాండు నుంచి నేడో, రేపో యాత్రికులు స్వస్థలాలకు రానున్నారు.

హైదరాబాద్‌కి చెందిన 40 మంది తెలుగు యాత్రికులు మానస సరోవరం హిల్‌సా వద్ద వాతావరణం అనుకూలించక అక్కడే ఐదురోజులుగా ఉండిపోయారు. దీంతో.. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఐదు రోజుల నుంచి అక్కడే వారు ఇబ్బంది పడుతున్నట్లుగా.. కుటుంబ సభ్యులకు వీడియో పంపారు.