కరోనా ఎఫెక్ట్: ఆసుప‌త్రిలో చేరిన 48 గంట‌ల్లోనే.. 28 మంది బాధితులు..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో యూపీలోని ఆగ్రా జిల్లాలో అధికారుల‌ను మ‌రింతగా క‌ల‌వ‌రానికి గురిచేసే ఘ‌ట‌న చోటుచేసుకుంది.

కరోనా ఎఫెక్ట్: ఆసుప‌త్రిలో చేరిన 48 గంట‌ల్లోనే.. 28 మంది బాధితులు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 22, 2020 | 3:27 PM

Coronavirus Outbreak: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో యూపీలోని ఆగ్రా జిల్లాలో అధికారుల‌ను మ‌రింతగా క‌ల‌వ‌రానికి గురిచేసే ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో కరోనా చికిత్స కోసం చేరిన 28 మంది కరోనా బాధితులు.. ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోనే మృతిచెందారు. ఈ ఉదంతంపై యోగి సర్కార్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో పాటు వెంట‌నే ద‌ర్యాప్తు కోసం ఆదేశాలు జారీ చేసింది.

వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా.. రాష్ట్రంలోనే కరోనాకు అత్య‌ధికంగా ప్ర‌భావిత‌మైన జిల్లాగా మారింది. ఇక్క‌డ ఇప్పటివరకు మొత్తం 75 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు. ఇది యూపీలో అత్యధికం.కాగా ప‌రిస్థితి విష‌మంగా మారిన త‌రువాత క‌రోనా బాధితుల‌ను ఆసుప‌త్రికి తీసుకువ‌చ్చార‌ని, చికిత్స అందించేందుకు అప్ప‌టికే ఆల‌స్యం అయ్యింద‌ని ఆగ్రా సీఎంవో ఆర్‌సీ పాండే తెలిపారు. ఆగ్రాలో చోటుచేసుకున్న మ‌ర‌ణాల్లో 85 శాతం 50 ఏళ్లు పైబడినవారివేన‌ని ఆరోగ్య శాఖ చెబుతోంది. అలాగే వారికి డయాబెటిస్, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు కూడా ఉన్నాయ‌ని తెలిపింది.

Also Read: ప్రపంచానికే భారత్ ఓ గొప్ప ఔషధాలయం..!