Mercedes Benz: ఈ ఏడాది మార్కెట్లో సరికొత్త కార్లు.. మే 10న మెర్సిడెస్‌ కొత్త లగ్జరీ కారు.. అదిరిపోయే ఫీచర్స్

Mercedes Benz: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల కార్లు విడుదలవుతున్నాయి. కరోనా కాలంలో వెనుకబడిన కార్ల అమ్మకాలు.. తర్వాత పుంజుకున్నాయి. ఇక జర్మనీ లగ్జరీ ఆటోమేటివ్‌..

Mercedes Benz: ఈ ఏడాది మార్కెట్లో సరికొత్త కార్లు.. మే 10న మెర్సిడెస్‌ కొత్త లగ్జరీ కారు.. అదిరిపోయే ఫీచర్స్
Follow us

|

Updated on: May 09, 2022 | 12:09 PM

Mercedes Benz: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల కార్లు విడుదలవుతున్నాయి. కరోనా కాలంలో వెనుకబడిన కార్ల అమ్మకాలు.. తర్వాత పుంజుకున్నాయి. ఇక జర్మనీ లగ్జరీ ఆటోమేటివ్‌ బ్రాండ్‌ మెర్సిడెస్‌-బెంజ్‌ కొత్త లగ్జరీ సెడాన్‌ 2022 సి-క్లాస్‌(Mercedes-Benz C-Class) నుంచి సరికొత్త కారు మార్కెట్లో విడుదల కానుంది. ఈ మోడల్‌ వాహనాన్ని మే 10వ తేదీన భారత మార్కెటలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది కంపెనీ బేబీ ఎస్-క్లాస్ అని పిలవబడే, కొత్త సి-క్లాస్ పూణే సమీపంలోని చకాన్ ప్లాంట్‌లో తయారు చేయనుంది. మెర్సిడెస్ ఇప్పటికే కొత్త సి-క్లాస్ బుకింగులను కూడా ప్రారంభించింది. విడుదల తర్వాత, Mercedes-Benz C-క్లాస్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువస్తోంది. C200, C220d అండ్ టాప్-ఎండ్ C300d. ఈ మోడల్ ఆన్‌లైన్‌లో అలాగే మెర్సిడెస్ ‘రిటైల్ ఆఫ్ ది ఫ్యూచర్’ ప్రోగ్రామ్ కింద అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ.49.99 లక్షలు, రూ.51.72 లక్షలు, రూ.55 లక్షల నుంచి ర.60 లక్షల వరకు ఈ మూడు మోడళ్ల ధర ఉండే అవకాశం ఉంది.

లగ్జరీ ఫీచర్లు:

ఈ మూడు సి-క్లాస్‌ మోడళ్లలో అద్భుతమైన ఫీచర్స్‌ను పొందుపర్చింది. మెర్సిడెస్ కొత్తగా అప్ డెటెడ్ సెడాన్ మునుపెన్నడూ లేనంత ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని కంపెనీ భావిస్తోంది. ఈ మోడల్‌ విడుదలైన తర్వాత C-క్లాస్ వోల్వో ఎస్60 (Volvo S60), బి‌ఎం‌డబల్యూ 3 సిరీస్ (BMW 3 series), ఆడి ఏ4 (Audi A4) వంటి కార్లతో పోటీ పడనుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 5వ జనరేషన్ Mercedes-Benz C-క్లాస్ మూడు వేరియంట్లలో విడుదల చేయనుంది. ఇందులో టాప్-ఆఫ్-ది-లైన్ C300dకి అదనంగా C200, C220d ఉన్నాయి. లగ్జరీ సెడాన్ కొత్త 1.5-లీటర్ పెట్రోల్ అండ్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌లతో అందించనుంది. రెండు ఇంజన్లు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ, 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ స్టాండర్డ్ గా పొందుతాయి. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 201 bhp శక్తిని, 300 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ 197 bhp శక్తిని, 440 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. C300dలో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 261 bhp, 550 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కొత్త సి-క్లాస్ 7.3 సెకన్లలో 0 నుండి 100 కి.మీ స్పీడ్ అందుకోగలదని మెర్సిడెస్ పేర్కొంది. అయితే టాప్-స్పెక్ C300d కేవలం 5.7 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకోగలదు. వీటి బుకింగ్స్‌ మే 1 నుంచే ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి

ఇక ఇదే కాకుండా జూన్‌లో జీప్‌ మెరిడియర్‌ భారత్‌ మార్కెట్లో విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన ఆర్డర్లు ఇప్పటికే జరుగుతున్నాయి. ఆగ్సటులో Kia EV6, టాయోటా ల్యాండ్‌ క్రూయిర్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. బుకింగ్స్ మే 26 నుంచి ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా ఇటీవలే కొత్త తరం స్కార్పియో టీజర్‌ను విడుదల చేసింది. రాబోయే నెలల్లో దానిని విడుదల చేయనుంది. ఇక టాటా నెక్సాన్‌ E మ్యాక్స్‌ మే 11 జిప్‌ మెరిడియన్‌ జూన్‌లో, కియా EV6 ఆగస్టులో, టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ 300 సిరీస్‌ ఆగస్టులో, సిట్రోయెన్‌ C3, మహీంద్రా నుంచి స్కార్పియో ఈ ఏడాదిలో విడుదల కానున్నాయి. ఇవే కాకుండా హ్యుందాయ్‌, మారుతితో పాటు ఇతర కంపెనీల నుంచి ఈ ఏడాదిలో మరిన్ని కొత్త తరం కార్లు మార్కెట్లో విడుదల కానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..