Pongal 2021 Movies: పొంగల్ బరిలో సినిమాల దంగల్.. ఊపు తెచ్చింది ఎవరు..? ఉసూరుమనిపించింది ఎవరు?

లాంగ్ గ్యాప్‌ తరువాత జరిగిన సినిమా పండుగలో మిక్స్‌డ్‌ రిజల్ట్సే కనిపించాయి. 'క్రాక్‌', 'రెడ్' సినిమాలు పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోగా 'మాస్టర్'‌, 'అల్లుడు అదుర్స్' డిజాస్టర్‌ అంటున్నారు ఆడియన్స్‌.

Pongal 2021 Movies: పొంగల్ బరిలో సినిమాల దంగల్.. ఊపు తెచ్చింది ఎవరు..? ఉసూరుమనిపించింది ఎవరు?
Follow us

|

Updated on: Jan 16, 2021 | 1:06 PM

Pongal 2021 Movies: లాంగ్ గ్యాప్‌ తరువాత జరిగిన సినిమా పండుగలో మిక్స్‌డ్‌ రిజల్ట్సే కనిపించాయి. ‘క్రాక్‌’, ‘రెడ్’ సినిమాలు పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోగా ‘మాస్టర్’‌, ‘అల్లుడు అదుర్స్’ డిజాస్టర్‌ అంటున్నారు ఆడియన్స్‌. దీంతో మరోసారి సోషల్ మీడియాలో సినిమా డిస్కషన్, ఫన్నీ మీమ్స్‌ గట్టిగా ట్రెండ్‌ అవుతున్నాయి.

ఫైనల్‌గా థియేటర్ల గేట్లు తెరుచుకున్నాయి. సంక్రాంతి సీజన్‌తో సినిమా టాక్స్‌ మొదలయ్యాయి. ఇన్నాళ్లు ఓటీటీ రిలీజ్‌లతో డల్‌ అయిన ఆడియన్స్‌.. ఇప్పుడు సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్‌, ఫస్ట్‌ డే కలెక్షన్‌ అంటూ సినిమాటిక్‌ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటున్నారు. ‘క్రాక్‌’ మాస్ ఫార్ములాతో బోణి బాగానే చేసినా.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అన్న ట్యాగ్‌తో వచ్చిన ‘అల్లుడు అదుర్స్‌’ మాత్రం అంత సౌండ్‌ చేయలేకపోయింది. ఈ సినిమాతో పాటు మాస్టర్‌కు కూడా నెగెటివ్‌ రిపోర్ట్సే రావటంతో మీమ్స్‌కు పని పెట్టారు ట్రోలర్స్‌. టాక్‌ పాజిటివ్,‌ నెగెటివ్‌ అన్న విషయం పక్కన పెడితే, ‘మాస్టర్’‌ ఫస్ట్ డే కలెక్షన్ 40 కోట్లు అన్న వెర్షన్‌ కూడా వినిపిస్తోంది. సో ఇలా మరోసారి సినిమా డిస్కషన్ మొదలు కావటంతో ఫిలిం లవర్స్ పండగ చేసుకుంటున్నారు. (Corona Vaccine: తిరుపతి రుయా ఆసుపత్రిలో విచిత్ర పరిస్థితి.. వ్యాక్సిన్ కోసం ఇంతవరకూ ముందుకు రాని సిబ్బంది)

Also Read:

Kangana Ranaut: మరో డేరింగ్ డెసిషన్ తీసుకున్న కంగనా రనౌత్.. ఇకపై అలాంటి సినిమాలకే ప్రాధాన్యత