Tokyo Olympics 2020 Highlights: మహిళల హాకీ: జర్మనీ చేతిలో 2-0తో భారత్‌ ఓటమి..

| Edited By: Ravi Kiran

Updated on: Jul 26, 2021 | 7:50 PM

Tokyo Olympics 2020 Live Updates: నాలుగవ రోజు భారత్ పలు క్రీడలలో పాల్గొంటుంది. ఫెన్సింగ్ క్రీడలో దేశం మొదటిసారిగా తన ఉనికిని నమోదు చేస్తోంది.

Tokyo Olympics 2020 Highlights: మహిళల హాకీ: జర్మనీ చేతిలో 2-0తో భారత్‌ ఓటమి..
Indian Hockey

Tokyo Olympics 2020 Live: టోక్యో ఒలింపిక్స్‌లో జులై 25న భారత్‌కు పతకాలేమీ దక్కలేదు. అలాగే పలు క్రీడల్లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఎంసీ మేరీ కోమ్, మణికా బాత్రా, సింధు వంటి ఆటగాళ్లు ఒక వైపు గెలవగా, మరోవైపు మను బాకర్, యశస్విని దేస్వాల్ వంటి పతక పోటీదారులు నిరాశ పరిచారు. ఇద్దరూ తమ ఈవెంట్ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారత పురుషుల ఆర్చరీ జట్టు (అతను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణదీప్ రాయ్) నాలుగవ రోజు బరిలోకి దిగనున్నారు. భారత మహిళా హాకీ జట్టు జర్మనీతో రెండో పూల్ మ్యాచ్ ఆడనుంది.

బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో భారత్ తరపున బరిలోకి దిగిన సాత్విక్ రాంకిరెడ్డి- చిరాగ్ శెట్టి ఓటమిపాలయ్యారు. ఇండోనేషియా జోడీ 21-13, 21-12తేడాతో భారత్ జోడీపై విజయం సాధించింది. కాగా సాత్వి్క్ ఆంధ్రప్రదేశ్‌ నుంచి బరిలోకిదిగాడు.

రెండో మ్యాచ్ ఆడకుండా బి. సాయి ప్రణీత్ ఒలింపిక్ ప్రయాణం ముగిసింది. ఇజ్రాయెల్‌కు చెందిన మిషా జిల్‌బెర్మాన్ తన రెండవ మ్యాచ్‌లో ప్రణీత్‌ను ఓడించాడు. దీంతో ప్రణీత్ గ్రూప్‌లో టాప్ 2 లో చేరే అవకాశం లేకుండా పోయింది. తదుపరి మ్యాచ్ గెలిచినా.. ప్రణీత్ ముందుకు వెళ్లలేడు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Jul 2021 06:50 PM (IST)

    మహిళల హాకీ: జర్మనీ చేతిలో 2-0తో భారత్‌ ఓటమి..

    టోక్యో ఒలింపిక్స్ -2020 రెండో మ్యాచ్‌లో భారత మహిళా హాకీ జట్టు ఓడిపోయింది. పూల్-ఎ మ్యాచ్‌లో జర్మనీ చేతిలో 2-0 తేడాతో ఓటమిపాలైంది. మునుపటి మ్యాచ్ కంటే ఈ మ్యాచ్‌లో భారత్ మెరుగైన ఆటతీరు కనబరిచినప్పటికీ ఓటమి తప్పలేదు.

  • 26 Jul 2021 06:14 PM (IST)

    ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మీరాబాయి చానుకి ఘనస్వాగతం..

    టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్‌ కొట్టిన భారత వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చానుకు దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు వెయిట్‌లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ అధికారులు మీరాబాయికి ఘనస్వాగతం పలికారు.

  • 26 Jul 2021 05:16 PM (IST)

    టెన్నిస్: నోవాక్ జొకోవిక్ గెలుపు..

    ప్రపంచ నెంబర్ -1 క్రీడాకారుడు సెర్బియాకు చెందిన నోవాక్ జొకోవిచ్ సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్ మ్యాచ్‌లో అద్భుతమైన విజయం సాధించాడు. అతను జర్మనీకి చెందిన జీన్ లెనార్డ్ స్ట్రఫ్‌ను 6-4, 6-3తో వరుస సెట్లలో ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు.

  • 26 Jul 2021 04:27 PM (IST)

    నిరాశపరిచిన భారత స్విమ్మర్ సజన్ ప్రకాష్

    భారత స్విమ్మర్ సజన్ ప్రకాష్ సెమీ ఫైనల్‌కు చేరుకోలేకపోయాడు. పురుషుల 200 మీటర్ల ఈవెంట్‌లో హీట్-2లో ప్రకాష్ 1.57.22 సెకన్ల టైమింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచాడు, కానీ సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. ఐదు హీట్లలో, టాప్ -16 ఈతగాళ్ళు సెమీ-ఫైనల్ అర్హత సాధిస్తారు, కాని సాజన్ టాప్-16లో చోటు దక్కించుకోలేదు.

  • 26 Jul 2021 04:22 PM (IST)

    57 ఏళ్ల పతక విజేత

    పురుషుల స్కీట్‌లో, కువైట్‌కు చెందిన అబ్దుల్లా అల్ రషీది (57) కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు, లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించిన షూటర్ గగన్ నారంగ్ ట్వీట్ చేసి ఆయనను ప్రశంసించారు.

  • 26 Jul 2021 03:31 PM (IST)

    బాక్సింగ్ - ఆశిష్ కుమార్ ఓటమి

    భారత బాక్సర్ ఆశిష్ కుమార్ ఇప్పటికే మొదటి రౌండ్‌లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.  చైనా బాక్సర్ చేతిలో ఆశిష్‌ 5-0తో ఓటమిపాలయ్యాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో ఆశిష్ ప్రయాణం ముగిసింది. రెండో రౌండ్‌లో ఆశిష్ పుంజుకున్నా.. ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది.

  • 26 Jul 2021 02:25 PM (IST)

    మనిక బత్రా ఓటమి

    టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌‌లో మనిక బత్రా పరాజయం పాలైంది. మూడో రౌండ్‌లో  మనిక బత్రా ఆస్టియాకి చెందిన సోఫియా పాల్కనోవా చేతిలో 4-0 తేడాతో ఓడిపోయింది. మానికా 8-11, 2-11, 5-11, 7-11 తేడాతో ఓటమి చెందింది.

  • 26 Jul 2021 12:59 PM (IST)

    చానుకి రాజ్యసభలో ప్రశంసలు

    మీరాబాయి చాను రాజ్యసభలో పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకున్నారు. ఒలింపిక్స్‌లో చాను వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈమేరకు నేడు రాజ్యసభ సభ్యులు అభినందించారు.

  • 26 Jul 2021 12:55 PM (IST)

    వైరలవుతోన్న ఆస్ట్రేలియా కోచ్ విన్యాసాలు

    ఆస్ట్రేలియాకు చెందిన అరియాన్ టిట్మస్ స్మిమ్మింగ్‌లో 400 మీటర్ల ఫ్రీస్టైల్‌లో బంగారు పతకం సాధించాడు. అయితే, ఈ విజయం ఆయనకు థ్రిల్లింగ్ ఇచ్చిందో లేదో కానీ, అతడి కోచ్‌కి మాత్రం ఫుల్‌గా ఖుసీ అయ్యాడు. అతగి విన్యాసాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

  • 26 Jul 2021 12:48 PM (IST)

    ముగిసిన టెన్నిస్ ప్రయాణం

    సుమిత్ నాగల్ ఓటమితో టోక్యో ఒలింపిక్స్‌లో టెన్నిస్ ఈవెంట్‌లో భారత్ ప్రయాణం ముగిసింది. ఈసారి భారతదేశం పురుషుల సింగిల్స్ , మహిళల డబుల్స్‌లో మాత్రమే పాల్గొంది. ఈ రెండింటిలోనూ ఓడిపోయింది. మొదట సానియా మీర్జా-అంకితా రైనా జోడీ మొదటి రౌండ్లో పరాజయం పాలయ్ముయారు.  ఈ రోజు సుమిత్ నాగల్ సింగిల్స్‌లో ఓడిపోాయాడు. 1996 లో లియాండర్ పేస్ కాంస్య పతకం సాధించిన తరువాత, ఇంతవరకు ఈ ఈవెంట్‌లో మరో పతకం రాలేదు.

  • 26 Jul 2021 12:46 PM (IST)

    స్వదేశం చేరుకున్న రజత పతక విజేత

    మీరాబాయి చాను ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఈ రోజు స్వేదేశం చేరుకున్న చాను.. ట్వీట్ చేసింది

  • 26 Jul 2021 11:20 AM (IST)

    ఆర్చరీ - క్వార్టర్ ఫైనల్లో ఓటమి

    క్వార్టర్ ఫైనల్‌లో భారత పురుషుల టీం ప్రయాణం ముగిసింది. మొదటి రౌండ్‌లో భారత్ 9-9-8 సాధించింది. కొరియా మొదటి రౌండ్లో 8-10-10 స్కోరుతో బదులిచ్చింది. మూడో రౌండ్‌లో భారత్‌ 9-10-9 స్కోరు చేయగా, కొరియా 9-10-9తో సెట్‌ను గెలుచుకుంది. దీంతో కొరియా మ్యాచ్‌ను 6-0తో గెలిచుకుంది. ఆర్చరీలోనూ పతకం ఆశలపై నీరుగారాయి.

  • 26 Jul 2021 10:41 AM (IST)

    బ్యాడ్మింటన్: సాత్విక్ రాంకిరెడ్డి- చిరాగ్ శెట్టి ఓటమి

    బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో భారత్ తరపున బరిలోకి దిగిన సాత్విక్ రాంకిరెడ్డి- చిరాగ్ శెట్టి ఓటమిపాలయ్యారు. ఇండోనేషియా జోడీ 21-13, 21-12తేడాతో భారత్ జోడీపై విజయం సాధించింది.

  • 26 Jul 2021 09:44 AM (IST)

    బ్యాడ్మింటన్: సాయి ప్రణీత్ ప్రయాణం ముగిసింది

    రెండో మ్యాచ్ ఆడకుండా బి. సాయి ప్రణీత్ ఒలింపిక్ ప్రయాణం ముగిసింది. ఇజ్రాయెల్‌కు చెందిన మిషా జిల్‌బెర్మాన్ తన రెండవ మ్యాచ్‌లో ప్రణీత్‌ను ఓడించాడు. దీంతో ప్రణీత్ గ్రూప్‌లో టాప్ 2 లో చేరే అవకాశం లేకుండా పోయింది. తదుపరి మ్యాచ్ గెలిచినా.. ప్రణీత్ ముందుకు వెళ్లలేడు.

  • 26 Jul 2021 08:03 AM (IST)

    ఫెన్సింగ్: భవానీ దేవి పరాజయం

    ఒలింపిక్స్ అరంగేట్రం చేసిన భవానీ దేవి రౌండ్ 32 మ్యాచ్‌లో 15-7 తేడాతో ఓడిపోయింది. ప్రపంచ నంబర్ 3 మనోన్ బ్రూనెట్‌తో జరిగిన ఈ మ్యాచులో 15-7 తేడాతో ఓడిపోయింది. ఒలింపిక్స్ స్థాయిలో ఫెన్సింగ్‌లో భారతదేశం తరపున తొలి అడుగులు వేసిన భవానీ... ఫైనల్ చేరకుండానే వెనుదిరిగింది.

  • 26 Jul 2021 07:32 AM (IST)

    టేబుల్ టెన్నిస్: శరత్ కమల్ విజయం

    అచంత్ శరత్ కమల్ 4-2తో పోర్చుగల్‌కు చెందిన టియాగోను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో శరత్ 2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9తో విజయం సాధించాడు.

  • 26 Jul 2021 07:17 AM (IST)

    ఆర్చరీ: క్వార్టర్ ఫైనల్‌ చేరిన పురుషుల జట్టు

     పురుషుల ఆర్చరీ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. చివరి రౌండ్లో కజకిస్తాన్ 54/60 స్కోరు సాధించింది. చివరి షాట్‌లో భారత్‌కు 9 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు అవసరం. దీంతో అతను దాస్ 9 పాయింట్లు సాధించి జట్టుకు 6-2 విజయాన్ని అందించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో చేరిన భారత ఆర్చరీ టీం.. కొరియాతో తలపడనుంది.

  • 26 Jul 2021 06:12 AM (IST)

    బరిలోకి పురుషుల ఆర్చరీ జట్టు

    భారత పురుషుల జట్టు అతను దాస్, ప్రవీణ్ జాదవ్, తరుణదీప్ రాయ్ తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.

  • 26 Jul 2021 06:08 AM (IST)

    భవానీ దేవి విజయం

    భవానీ దేవి మొదటి మ్యాచ్‌లో ప్రత్యర్థిపై15-3తేడాతో గెలిచింది.

  • 26 Jul 2021 06:06 AM (IST)

    భవానీ తొలిపోరు ప్రారంభం

    భారత్ నుంచి 4వ రోజు ఒలింపిక్స్‌లో భవానీ పోరు ప్రారంభమైంది. ప్రపంచ ర్యాకింగ్స్‌లో 42వ స్థానంలో ఉన్న ఆమె, ఒలింపిక్స్‌లో 29వ సీడ్‌గా బరిలోకి దిగనుంది. ట్యునీషియాకు చెందిన బెన్ అజ్జి నాడియాతో తలపడనుంది.

Published On - Jul 26,2021 7:48 PM

Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?