Azadi Ka Amrit Mahotsav: భారత స్వాతంత్య్రోద్యమాన్ని కీలక మలుపు తిప్పిన రోజు..ఇదేనని మీలో ఎంతమందికి తెలుసు..

దశాబ్ధాల పాటు జరిగిన ఉద్యమ ఫలితంగా 1947 ఆగష్టులో బ్రిటిషు పాలకుల నుంచి విముక్తి పొందాం. ఈస్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రజలను చైతన్యం చేసేందుకు ఎంతోమంది మహానీయులు కృషిచేశారు. ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టేందుకు జరిగిన పోరాటంలో ఎందరో స్వాతంత్య్ర పోరాట యోధులు అమరులయ్యారు.

Azadi Ka Amrit Mahotsav: భారత స్వాతంత్య్రోద్యమాన్ని కీలక మలుపు తిప్పిన రోజు..ఇదేనని మీలో ఎంతమందికి తెలుసు..
Quit India(File Photo)
Follow us

|

Updated on: Aug 08, 2022 | 12:31 PM

Quit India Movement: దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటం ఎన్నో మలుపులు తిరిగింది. దశాబ్ధాల పాటు జరిగిన ఉద్యమ ఫలితంగా 1947 ఆగష్టులో బ్రిటిషు పాలకుల నుంచి విముక్తి పొందాం. ఈస్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రజలను చైతన్యం చేసేందుకు ఎంతోమంది మహానీయులు కృషిచేశారు. ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టేందుకు జరిగిన పోరాటంలో ఎందరో స్వాతంత్య్ర పోరాట యోధులు అమరులయ్యారు. వీరిలో మనకు తెలిసిన వారు కొందరైతే.. తెలియని వారెందరో.. ఇలా నేటి సమాజానికి తెలియని ఎందరో స్వాతంత్య్ర సమరయోధులను ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం అజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా స్వాతంత్య్రోద్యమంలో కీలకమైన ఘట్టాలను ప్రజలు తెలుసుకునే అవకాశం దొరికింది. దశాబ్ధాల భారత స్వాతంత్య్రోద్యమాన్ని కీలక మలుపు తిప్పిన రోజు.. ఈరోజేనని మనలో ఎంత మందికి తెలుసు..ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ ఆరోజేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నో కీలక ఘట్టాలు ఉన్నప్పటికి.. క్విట్ ఇండియా ఉద్యమానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకమైనది. క్విట్ ఇండియా మూమెంట్ ప్రారంభమైన ఐదేళ్లకే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. ఆంగ్లేయుల పాలనకు చరమగీతం పాడి..భారతమాతకు దాస్యశృంఖాల నుంచి విముక్తి కలిగించి..జాతీయోధ్యమంలో కీలకంగా నిలిచిన క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగష్టు 8 వ తేదీన ప్రారంభమైంది. అంటే క్విట్ ఇండియా మూమెంట్ ప్రారంభమై ఈరోజుకి సరిగ్గా 80 సంవత్సరాలు. ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానం నుంచి విజయమో..వీరస్వర్గమో అంటూ మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపునకు ఉత్తేజితులైన భారతీయులు వెంటనే ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ పోరాటమే భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పింది.

క్రిప్స్ రాయభారం విఫలం కావడంతో 1942 జులైలో వార్ధాలో సమావేశమైన జాతీయ కాంగ్రెస్ కార్యవర్గం బ్రిటిషు పాలకులకు వ్యతిరేకంగా ప్రజల సహకారంతో ఉద్యమాన్ని ఉదృతం చేయాలని తీర్మానించింది. దీంతో ఆతర్వాత నుంచి ఎంతో మంది కాంగ్రెస్ నాయకులను బ్రిటిషు ప్రభుత్వం జైలుకు పంపింది. ఈక్రమంలో 1942 ఆగష్టు 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ స్వరాజ్యం తీర్మానాన్ని ఆమోదించింది. అదేరోజు ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో మహాత్మాగాంధీ మాట్లాడుతూ.. బ్రిటిషు వారిని భారత్ నుంచి తరిమికొట్టాలి-క్విట్ ఇండియా.. స్వాతంత్య్రం కోసం విజయమో వీరస్వర్గమో అనే విధంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అన్నివర్గాల వారు ఈఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ఈపిలుపుని అందిపుచ్చుకున్న ప్రజలు ఆమరుసటి రోజు నుంచే స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణలకు దిగారు. ప్రధాన నగరాల్లో నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. బంద్ లు, భారీ ర్యాలీలు నిర్వహించారు. ఆతరువాత ఈఉద్యమం పట్టణాలు, పల్లెలకు వ్యాపించింది. ప్రజలు స్వచ్ఛందంగా సత్యాగ్రాహాలు చేశారు. పరిశ్రమల్లో కార్మికులు విధులు బహిష్కరిస్తే.. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలను వదిలి ఉద్యమంలో భాగస్వాములయ్యారు. దక్షిణ భారతదేశంలో ఉద్యమం మరింత ఉధృతమైంది. పోలీసులు, సైనికులు ఉద్యమకారులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. వేలాది మందిని జైలులో పెట్టారు. అయినా స్వాతంత్య్రం సాధించాలనే భారతీయుల స్వప్నం, సంకల్పం చెక్కు చెదరలేదు. ఫలితంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ఐదేళ్లకే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. ఆగష్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే ఆగష్టు 8వ తేదీ..స్వాతంత్య్రం రావడానికి బలమైన పునాది పడినరోజుగా చెబుతుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..