సామాన్యుడికి పెట్రోల్ షాక్…రూ.80 దాటేసిన ధర..!

పెట్రోల్, డీజిల్ వినియోగ‌దారుల‌కు షాక్ ఇస్తూనే ఉన్నాయి. వ‌ర‌స‌గా 11వ రోజు కూడా దేశీ ఇంధన ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో బుధవారం లీటరు పెట్రోల్ ధర 57 పైసలు పెరుగుదలతో రూ.80.22కు చేరుకుంది. డీజిల్ ధర 58 పైసలు పెరిగి రూ.74.07కు వెళ్లింది.

సామాన్యుడికి పెట్రోల్ షాక్...రూ.80 దాటేసిన ధర..!
Follow us

|

Updated on: Jun 17, 2020 | 10:48 AM

పెట్రోల్, డీజిల్ వినియోగ‌దారుల‌కు షాక్ ఇస్తూనే ఉన్నాయి. వ‌ర‌స‌గా 11వ రోజు కూడా దేశీ ఇంధన ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో బుధవారం లీటరు పెట్రోల్ ధర 57 పైసలు పెరుగుదలతో రూ.80.22కు చేరుకుంది. డీజిల్ ధర 58 పైసలు పెరిగి రూ.74.07కు వెళ్లింది. మ‌రోవైపు అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్‌ ధర 55 పైసలు పెరుగుదలతో రూ.80.66కు.. డీజిల్‌ ధర కూడా 57 పైసలు పెరుగుదలతో రూ.74.54కు చేరాయి. ఇక విజయవాడలోనూ ఇంచుమించు ఇవే రేట్లు ఉన్నాయి. పెట్రోల్ ధర 56 పైసలు పెరుగుదలతో రూ.80.27కు చేరింది. డీజిల్ ధర కూడా 56 పైసలు పెరుగుదలతో రూ.74.17కు పెరిగింది.

ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రతి రోజు మార్పులు సంభ‌విస్తూ ఉంటాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో ముడిచమురు ధరల ఆధారంగా.. ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్ల‌ను పెంచుతూ, త‌గ్గిస్తూ ఉంటాయి.