లాక్‌డౌన్ లోనూ.. జరిగిన బాల్యవివాహం..!

తెలంగాణలో బాల్య వివాహం చోటుచేసుకుంది. ఈ నెల(జూన్) 1న 16 ఏళ్ల బాలిక, 23 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. పిల్లల హక్కుల కార్యకర్తలు.. బాల్యవివాహ నివారణ చట్టం, పోక్సో, బలవంతంగా

  • Tv9 Telugu
  • Publish Date - 1:39 pm, Thu, 4 June 20
లాక్‌డౌన్ లోనూ.. జరిగిన బాల్యవివాహం..!

తెలంగాణలో బాల్య వివాహం చోటుచేసుకుంది. ఈ నెల(జూన్) 1న 16 ఏళ్ల బాలిక, 23 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. పిల్లల హక్కుల కార్యకర్తలు.. బాల్యవివాహ నివారణ చట్టం, పోక్సో, బలవంతంగా లేదా మైనర్‌ను వివాహం చేసుకోవటానికి ప్రేరేపించడం (366) కింద వరుడు, వధూవరుల తల్లిదండ్రులు, పూజారి, గ్రామ పెద్దలపై కూడా కేసులు నమోదు చేశారు.

ఈ కేసును సంబంధించి బాలల హక్కుల సంఘం కార్యకర్త అచ్యుతరావు.. పూజారి, వధూవరుల తల్లిదండ్రులు, వరుడిపై జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. కాగా.. హైదరాబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండ్లపోచంపల్లికి సమీపంలో కండ్లకోయలోని ఒక ఆలయంలో ఈ వివాహం జరిగింది. బాలిక వయసు 16 ఏళ్లు అని ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు. వరుడు నిర్మాణ రంగం కార్మికుడు. కనీసం 30 మంది అతిథులు సామాజిక దూరం పాటించకుండా, ఫేస్ మాస్క్‌లు లేకుండా ఈ వివాహానికి హాజరయినట్లు తెలుస్తోంది.

Also Read: టెన్త్ విద్యార్థుల కోసం.. నేటి నుంచి తెరుచుకోనున్న సంక్షేమ హాస్టళ్లు..