మహారాష్ట్రలో మావోల ఘాతుకం.. 15మంది పోలీసులు మృతి

మహారాష్ట్రలో మావోలు రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లాలో పోలీసు వాహనమే లక్ష్యంగా ఐఈడీని పేల్చేశారు. ఈ ఘటనలో డ్రైవర్ సహా 15మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనాస్థలికి చేరుకొని మావోల కోసం కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో  ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరుగాయి. ఇక ఈ ఘటనపై పలు కీలక అంశాలు ఇప్పుడు చూద్దాం… భద్రతా దళాలు ప్రయాణిస్తున్న వాహనమే టార్గెట్ గా మావోలు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇప్పటివరకు […]

మహారాష్ట్రలో మావోల ఘాతుకం.. 15మంది పోలీసులు మృతి
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 01, 2019 | 5:55 PM

మహారాష్ట్రలో మావోలు రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లాలో పోలీసు వాహనమే లక్ష్యంగా ఐఈడీని పేల్చేశారు. ఈ ఘటనలో డ్రైవర్ సహా 15మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనాస్థలికి చేరుకొని మావోల కోసం కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో  ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరుగాయి.

ఇక ఈ ఘటనపై పలు కీలక అంశాలు ఇప్పుడు చూద్దాం…

  • భద్రతా దళాలు ప్రయాణిస్తున్న వాహనమే టార్గెట్ గా మావోలు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 16 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని ఓ భద్రతా అధికారి మీడియాకు తెలిపారు. అంతేకాదు ఆ సంఘటనా స్థలానికి మరిన్ని భద్రతా దళాలను పంపించి కూంబింగ్ చేబడుతున్నాం అని ఆ అధికారి తెలిపారు.
  • ఉదయం 3.30 గంటల సమయంలో మావోలు పెట్రోల్, కెరొసిన్ తో నిండి ఉన్న సుమారు 25 వాహనాలను తగలబెట్టారు. ఆ తర్వాత గడ్చిరోలి జిల్లాలోని జమ్భంపాడా గ్రామం సమీపంలో పోలీసుల వాహనాన్ని టార్గెట్ చేశారని పోలీస్ అధికారి శైలేష్ బల్కవాడే తెలిపారు.
  • ‘‘గడ్చిరోలిలో పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. ధైర్యవంతులైన పోలీసులకు నా సెల్యూట్. వారి త్యాగం ఎప్పటికీ మరవలేనిది. అమరులైన పోలీసుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ఘటనకు బాధ్యులైన ఎవ్వరినీ వదిలిపెట్టం’’ అంటూ ట్విట్టర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.
  • “మావోయిస్టుల దాడిలో గడ్చిరోలిలోని సీ-60 దళానికి చెందిన 16 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు నా సంతాపం తెలియచేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయపడుతుందని.. డీజీపీ, గడ్చిరోలి ఎస్పీతో సంప్రదింపులు జరుపుతున్నామని” మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు.
  • రెండు వారాల క్రితం గడ్చిరోలి పోలింగ్ బూత్ దగ్గర కూడా మావోలు మందు పాతరలు పేల్చారు. అయితే ఆ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
  • ఈ రోజు మహారాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. సరిగ్గా ఈ కాల్పులు ఇదే రోజున జరిగేలా మావోలు వారం రోజుల నుంచి రెక్కి నిర్వహించారని తెలుస్తోంది.
  • గడ్చిరోలి జిల్లాలో ఎన్నికలు ఏప్రిల్ 11న జరిగాయి.