గందరగోళంలో ప్రైవేట్ జూనియర్‌ కాలేజీల భవితవ్యం..?

అగ్నిమాపక శాఖ తమ నిబంధనలను మార్పు చేయడంతో.. తెలంగాణ రాష్ట్రంలోని 1,456 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు ఈసారి అనుబంధ గుర్తింపు లభించే పరిస్థితి లేకుండాపోయింది. ఎందుకంటే.. ఆ కాలేజీలకు అగ్నిమాపక శాఖ నుంచి

  • Tv9 Telugu
  • Publish Date - 1:59 pm, Wed, 22 July 20
గందరగోళంలో ప్రైవేట్ జూనియర్‌ కాలేజీల భవితవ్యం..?

Private junior colleges in Telangana: అగ్నిమాపక శాఖ తమ నిబంధనలను మార్పు చేయడంతో.. తెలంగాణ రాష్ట్రంలోని 1,456 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు ఈసారి అనుబంధ గుర్తింపు లభించే పరిస్థితి లేకుండాపోయింది. ఎందుకంటే.. ఆ కాలేజీలకు అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ) ఇచ్చే పరిస్థితి లేదు. ఫైర్‌ ఎన్‌వోసీ లేకుండా ఇంటర్మీడియట్‌ బోర్డు కాలేజీలను నడిపేందుకు అనుబంధ గుర్తింపును జారీ చేసే పరిస్థితి లేదు. దీంతో ఆయా కాలేజీల పరిస్థితి గందరగోళంలో పడింది.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,586 కార్పొరేట్, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలుంటే అందులో కేవలం 130 కాలేజీలు మాత్రమే అగ్నిమాపక శాఖ తాజా నిబంధనల ప్రకారం ఉండటంతో వాటికి మాత్రమే ఇంటర్‌ బోర్డు అనుబంధ గుర్తింపునిచ్చే అవకాశముంది. మిగతా 1,456 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించే అవకాశం లేకుండా పోయింది.

Also Read: నేటి నుంచి సంతలు బంద్.. రూల్స్ అతిక్రమిస్తే జరిమానా, కేసులు నమోదు..