గుంటూరులో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు.. మరిన్ని ఆంక్షలు..

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గుంటూరు జిల్లాలో తాజాగా మరో 14 కేసులు నమోదయ్యాయి.

గుంటూరులో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు.. మరిన్ని ఆంక్షలు..
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2020 | 3:08 PM

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గుంటూరు జిల్లాలో తాజాగా మరో 14 కేసులు నమోదయ్యాయి. వీటిలో 13 గుంటూరు నగరంలోనే నమోదవడం గమనార్హం. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 72కి చేరింది. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ తెలిపారు. గుంటూరులో కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.

కోవిడ్ 19 మహమ్మారి విజృంభిస్తుండటంతో గుంటూరు జిల్లాలో లాక్‌డౌన్‌ను పకడ్బంధీగా అమలు చేసేందుకు పోలీసులు మరిన్ని ఆంక్షలు విధించారు. నగరంలోని 10 ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించిన అధికారులు.. అక్కడ జనసంచారంపై తీవ్ర ఆంక్షలు విధించారు. కంటైన్మెంట్‌ జోన్లలో నివసించే ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, కూరగాయలు, పాలు వంటి వాటిని ఇళ్ల వద్దకే పంపించేలా మొబైల్‌ వాహనాలు ఏర్పాటు చేశారు.