రాజస్థాన్‌లో కొత్తగా 117 కరోనా కేసులు.. మొత్తం 678..

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాజస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే

రాజస్థాన్‌లో కొత్తగా 117 కరోనా కేసులు.. మొత్తం 678..
Covid-19
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2020 | 7:49 PM

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాజస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే రాష్ట్ర రాజధాని జైపూర్ నగరంలోనే 65 కేసులు కొత్తగా నమోదయ్యాయని, వీటితో కలుపుకొని జైపూర్‌లో ఇప్పటివరకు 286 మంది కరోనా బారిన పడ్డారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని ఇప్పటివరకు 678 కేసులు నమోదైనట్లు వివరించింది.

కాగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 23000 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఇంకా కొందరి రిపోర్టులు రావలసి ఉందని ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ కరోనా కారణంగా మరణించిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి 50 లక్షల రూపాయలు అందజేయనున్నట్లు తెలిపారు.

Also Read: ఢిల్లీలో 903 కరోనా పాజిటివ్ కేసులు.. 13మంది మృతి..