5

డెంగ్యూ ఫీవర్‌తో బాలిక మృతి

డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతూ  హర్షిత అనే బాలిక మృతి చెందింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సీతారాంపేట గ్రామానికి చెందిన హర్షిత( 11) అనే బాలిక డెంగ్యూ జ్వరంతో బాధపడటంతో తండ్రి రామచందర్ వారం రోజులక్రితం నీలోఫర్‌లో చేర్చారు.  వారం రోజులుగా చికిత్స పొందుతూ  నీలోఫర్ హాస్పిటల్‌లో సోమవారం బాలిక కన్నుమూసింది.  బాలిక మృతితో హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వర్షాకాలం కావడంతో దోమలు బెడద అధికమైంది. దీంతో వైరల్ ఫీవర్స్ అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే […]

డెంగ్యూ ఫీవర్‌తో బాలిక మృతి
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 6:16 PM

డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతూ  హర్షిత అనే బాలిక మృతి చెందింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సీతారాంపేట గ్రామానికి చెందిన హర్షిత( 11) అనే బాలిక డెంగ్యూ జ్వరంతో బాధపడటంతో తండ్రి రామచందర్ వారం రోజులక్రితం నీలోఫర్‌లో చేర్చారు.  వారం రోజులుగా చికిత్స పొందుతూ  నీలోఫర్ హాస్పిటల్‌లో సోమవారం బాలిక కన్నుమూసింది.  బాలిక మృతితో హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

వర్షాకాలం కావడంతో దోమలు బెడద అధికమైంది. దీంతో వైరల్ ఫీవర్స్ అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే నగరంలోని ఫీవర్ హాస్పిటల్‌ జ్వర పీడితులతో నిండిపోయింది. జ్వరంతో బాధపడుతున్న చిన్నారులతో నీలోఫర్ హాస్పిటల్ కూడా కిక్కిరిసిపోతుంది.