Janmashtami: కాలసర్ప దోషంతో ఇబ్బందిపడుతున్నారా.. జన్మాష్టమి రోజున ఇలా పూజించండి.. కోరిన వరాన్ని పొందండి..

ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ జీవితంలో పురోగతి లేదని, ఏదో ఒక ఆటంకం ఉందని లేదా మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయని మీరు భావిస్తే, దానిని అధిగమించడానికి ఈ జన్మాష్టమి నాడు కన్నయ్యను పూజించండి

Janmashtami: కాలసర్ప దోషంతో ఇబ్బందిపడుతున్నారా.. జన్మాష్టమి రోజున ఇలా పూజించండి.. కోరిన వరాన్ని పొందండి..
Janmashtami Puja
Follow us

|

Updated on: Aug 18, 2022 | 10:03 AM

Janmashtami: హిందూమతంలో.. 64 కళలు కలిగిన ఏకైక దేవుడు శ్రీకృష్ణుడు. కలియుగంలో భక్తుల కష్టాల నుంచి విముక్తి కలిగించి.. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భావిస్తారు.  శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమిరోజున శ్రీ కృష్ణ భగవానుని ఆరాధనకు ముఖ్యమైనదిగా భావిస్తారు. ఎందుకంటే అష్టమిరోజున శ్రీమహావిష్ణువు.. శ్రీ కృష్ణుడుగా భూమిపై జన్మించాడు. ఈ రోజున కన్నయ్యను ఆరాధించడం, కీర్తనలు భజన చేయడంతో ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నిస్తాడు. మీరు కూడా ఒక నిర్దిష్ట కోరికతో ఈ సంవత్సరం జన్మాష్టమి రోజున ఉపవాసం చేయాలనుకుంటే.. కొన్ని నియమాలను అనుసరించాలి.

శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున పూజకు నియమాలు:   

1. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ జీవితంలో పురోగతి లేదని, ఏదో ఒక ఆటంకం ఉందని లేదా మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయని మీరు భావిస్తే, దానిని అధిగమించడానికి ఈ జన్మాష్టమి నాడు కన్నయ్యను పూజించండి. వెండి వేణువును శ్రీకృష్ణుడికి సమర్పించండి.

ఇవి కూడా చదవండి

2. పెళ్లయి చాలా కాలం గడిచినా సంతానం లేకుండా.. సంతానం కోసం జన్మాష్టమి నాడు శ్రీ కృష్ణుని పూజలో సంతానం గోపాల మంత్రాన్ని జపించాలి. చిత్తశుద్ధి, భక్తితో చేస్తేతప్పనిసరిగా ఒడినిండుతుందని నమ్మకం.

3.మీ జీవితానికి సంబంధించిన ఏదైనా అడ్డంకి లేదా ఏదైనా శత్రువు మీ కష్టాలకు కారణం అవుతున్నట్లయితే, వాటిని నివారించడానికి, ఈ సంవత్సరం జన్మాష్టమి పర్వదినాన “క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరి: పరమాత్మనే ప్రణత కేలష్ణ శాయ గోవిందాయ నమో నమః” అని జపించండి. వీలైనంత ఎక్కువ సార్లు చేయండి.

4. మీరు చేసిన శ్రీ కృష్ణుని సాధన విజయవంతం కావాలంటే.. మీరు తులసి, పసుపు చందనం లేదా వైజయంతీ మాలలతో ఆయన పూజలో ఏదైనా మంత్రాన్ని జపించాలి.

5. మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే.. ఈ సంవత్సరం జన్మాష్టమి నాడు, కుంకుమ కలిపిన పాలతో కన్నయ్యను అభిషేకించండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

6. పవిత్రమైన జన్మాష్టమి నాడు, శ్రీకృష్ణుడితో పాటు సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి, ఈ రోజున అరటి మొక్కను నాటండి. ప్రతిరోజూ ఆ మొక్కను పూజించి, సేవించండి.

7. పూజలో ప్రసాదానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, పవిత్రమైన జన్మాష్టమి పండుగ నాడు శ్రీ కృష్ణ భగవానుడి నుండి కోరుకున్న వరం పొందడానికి, లడ్డూ గోపాల్ ఆరాధనలో అతనికి ఇష్టమైన వెన్న, మిస్రిని సమర్పించండి.

8. హిందూ మతంలో శ్రీకృష్ణుడిని పీతాంబరధారి అని కూడా అంటారు. అంటే పసుపు బట్టలు ధరించేవాడు అని అర్థం. అటువంటి పరిస్థితిలో, జన్మాష్టమి పూజ ఫలం పొందడానికి, ఈ రోజున పసుపు బట్టలు ధరించి, పసుపు పండ్లు, పసుపు పువ్వులు, పసుపు మిఠాయిలను కన్నయ్యకు  సమర్పించండి.

9. మీ జాతకంలో కాల సర్ప దోషం ఉండి, ఆ కారణంగా మిమ్మల్ని కష్టాలు చుట్టుముట్టినట్లయితే, దాని నుండి బయటపడటానికి, జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజలో నెమలి ఈకలను సమర్పించండి. తరువాత ఆ నెమలి ఈకాలను మీ దిండు కింద ఉంచండి. . ఈ పరిహారం చేయడం ద్వారా, ఒక వ్యక్తి కాల సర్ప దోషం నుండి విముక్తి పొందుతాడని నమ్ముతారు.

10. ఏదైనా కారణం చేత మీ వివాహం ఆలస్యం అవుతుంటే.. , మీరు ”ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరి: పరమాత్మనే ప్రణత: క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః: ‘క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్భాయ స్వాహా’ అనే మంత్రాన్ని పఠించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)

ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు
ప్రమాదం అంచున చైనా.. మునిగిపోతున్న బీజింగ్, షాంఘై సహా అనేక నగరాలు
పురోహితులను ఇంతలా అవమానిస్తారా? వైరల్ వీడియోపై తీవ్ర ఆగ్రహం
పురోహితులను ఇంతలా అవమానిస్తారా? వైరల్ వీడియోపై తీవ్ర ఆగ్రహం
ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆరోజు వచ్చేసింది..
ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆరోజు వచ్చేసింది..
పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తం పార్టీతో కలిసొస్తాయా?
పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎర్రజెండాలు హస్తం పార్టీతో కలిసొస్తాయా?
నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?
నీచ బుధుడితో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! అందులో మీ రాశీ ఉందా..?
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
పాన్ కార్డు లేకున్నా సిబిల్ స్కోర్ ఎంతో తెలుసుకోవచ్చు..
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
గుడ్‌న్యూస్‌.. ఐపీఎల్‌ కోసం జియో టాప్‌-5 డేటా రీఛార్జ్‌ ప్లాన్స్
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!