ఆమె కడుపులో కేజీన్నర బంగారం..! గొలుసులు, కాయిన్లు కూడా..
కడుపు నొప్పితో ఓ మహిళ ఆస్పత్రికి వెళ్లింది.. ఆమెకు చికిత్స చేసిన డాక్టర్లు షాక్ తిన్నారు. మహిళ కడుపులో ఏకంగా కేజిన్నర బంగారు నగలు ఉండడంతో ఆశ్చర్యపోయారు. ఘటన బయటకు తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంత సంచలనం సృష్టించిన ఈ ఘటన పశ్చిమబెంగాల్లో వెలుగు చూసింది. పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లా రామ్పురహాట్కు చెందిన ఓ మహిళ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఏం జరిగిందోనని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు.. మహిళ కడుపులో లోహపదార్థాలు ఉన్నాయని.. […]
కడుపు నొప్పితో ఓ మహిళ ఆస్పత్రికి వెళ్లింది.. ఆమెకు చికిత్స చేసిన డాక్టర్లు షాక్ తిన్నారు. మహిళ కడుపులో ఏకంగా కేజిన్నర బంగారు నగలు ఉండడంతో ఆశ్చర్యపోయారు. ఘటన బయటకు తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇంత సంచలనం సృష్టించిన ఈ ఘటన పశ్చిమబెంగాల్లో వెలుగు చూసింది.
పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లా రామ్పురహాట్కు చెందిన ఓ మహిళ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఏం జరిగిందోనని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు.. మహిళ కడుపులో లోహపదార్థాలు ఉన్నాయని.. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్లు మహిళ కడుపులో బంగారు నగలు ఉండటంతో షాక్ తిన్నారు. గొలుసులు, కమ్మలు, రింగులు, కాయిన్స్.. కూడా ఉండటంతో.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అసలు ఆ మహిళ ఎందుకు బంగారు నగలు మింగిందోనని విచారణ చేసిన పోలీసులు.. మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిపారు.