Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

బుల్లితెరపై నిరాశపరిచిన మెగాస్టార్ ‘సైరా’..!

Latest Movie News, బుల్లితెరపై నిరాశపరిచిన మెగాస్టార్ ‘సైరా’..!

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను రాబట్టిందో అందరికీ తెలిసిందే. తెలుగులో తప్పితే మిగిలిన అన్ని భాషల్లోనూ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే పూర్తిగా నిరాశే ఎదురైంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జెమిని టీవీలో ప్రసారమైంది. మెగాస్టార్ చరిష్మా.. ఆపై చారిత్రాత్మక చిత్రం కావడం వల్ల ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారని అందరూ భావించారు. కానీ అవన్నీ రివర్స్ అయ్యాయి. ‘సైరా’ ఆశించిన స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్‌ను రాబట్టలేకపోయింది. కేవలం 11.8 టీఆర్పీని మాత్రమే దక్కించుకుంది. కొసమెరుపు ఏంటంటే ఈ సినిమా ప్రసారమైన సమయంలోనే మాటీవీలో వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ టెలికాస్ట్ అయింది. ఆ చిత్రానికి మాత్రం అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో తెలియదు గానీ.. తక్కువ మార్కెట్ ఉన్న ఛానల్‌లో టెలికాస్ట్ చేయడం వల్లే ఇలా జరిగిందని మెగా ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు.

Related Tags