దివంగత నటుడు శ్రీహరి తనయుడు హీరోగా ‘రాజ్‌ధూత్’

హైదరాబాద్‌: దివంగత నటుడు శ్రీహరి, డిస్కో శాంతి దంపతుల పెద్ద కుమారుడు మేఘామ్ష్‌ టాలీవుడ్‌కు హీరోగా తెరంగ్రేట్రం చేయబోతోన్నారు. ‘రాజ్‌ధూత్’ అనే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో కార్తిక్‌, అర్జున్‌ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. లక్ష్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎంఎల్‌వీ సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

స్టంట్‌ ఫైటర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి శ్రీహరి ఎన్నో చిత్రాల్లో నటించి ‘రియల్‌ స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1991లో ఆయన సినీ నటి డిస్కో శాంతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. 2013 అక్టోబర్‌లో శ్రీహరి అనారోగ్యంతో కన్నుమూశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *