ఢిల్లీ.. సన్‌రైజర్స్.. సత్తా ఎవరిదో.?

క్వాలిఫైయర్స్‌లో భాగంగా నేడు రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సాగరతీరం సాక్షిగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలబడనున్నాయి. లీగ్ దశలో చెరో మ్యాచ్ గెలుచుకున్న ఈ రెండు జట్లు.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో  చూడాలి. వార్నర్, బెయిర్‌స్టో జట్టుకు దూరమైనప్పటికీ అదృష్టం కలిసొచ్చి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది సన్‌రైజర్స్… అటు ఢిల్లీ సమిష్టి ప్రదర్శనతో లీగ్ దశలో విజయాలు సాధించి.. దాదాపు పదేళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. […]

ఢిల్లీ.. సన్‌రైజర్స్.. సత్తా ఎవరిదో.?
Follow us

|

Updated on: May 08, 2019 | 12:07 PM

క్వాలిఫైయర్స్‌లో భాగంగా నేడు రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సాగరతీరం సాక్షిగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలబడనున్నాయి. లీగ్ దశలో చెరో మ్యాచ్ గెలుచుకున్న ఈ రెండు జట్లు.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో  చూడాలి. వార్నర్, బెయిర్‌స్టో జట్టుకు దూరమైనప్పటికీ అదృష్టం కలిసొచ్చి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది సన్‌రైజర్స్… అటు ఢిల్లీ సమిష్టి ప్రదర్శనతో లీగ్ దశలో విజయాలు సాధించి.. దాదాపు పదేళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ అనడంలో సందేహం లేదు. అయితే అటు సన్ రైజర్స్ జట్టును కూడా ఈజీగా తీసేయలేం. చివరి లీగ్ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఫామ్‌లోకి వచ్చిన కెప్టెన్ విలియమ్సన్‌తో పాటు మనీష్‌ పాండే, మహ్మద్‌ నబి, రషీద్‌ ఖాన్‌లతో సన్‌రైజర్స్‌ జట్టు బలంగానే ఉంది. కాగా అటు ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌తో పాటు శిఖర్‌ ధావన్‌, రిషబ్‌ పంత్‌, బౌల్ట్‌, ఇషాంత్‌లపై భారీ ఆశలే పెట్టుకుందని చెప్పాలి.

ఢిల్లీతో అంత వీజీ కాదు…

ఇప్పటివరకు ఐపీఎల్ 11 సీజన్స్ జరిగితే… దాదాపు అన్నింట్లోనూ ఢిల్లీ లీగ్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్ లాంటి దిగ్గజ ఆటగాళ్ల కోచింగ్‌లో సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ ఆ జట్టు విజయాలు సాధిస్తూ ప్లేఆఫ్స్ వరకు చేరుకుంది. బౌలింగ్‌లో రబడా, బ్యాటింగ్‌లో పంత్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా రాణించారు. అయితే ప్లేఆఫ్స్‌కు ముందు బౌలర్ కాగిసో రబడా జట్టుకు దూరం కావడం వారికీ పెద్ద లోటే. ఇక గత ఐదు మ్యాచ్‌లు చూస్తే ఢిల్లీ చక్కటి ప్రదర్శన కనబరిచింది. ఇక అదే స్పూర్తితో ఈ క్వాలిఫైయర్ కూడా ఆడితే తప్పకుండా ఢిల్లీ ఫైనల్స్‌కు చేరుతుందని విశ్లేషకుల అంచనా.

అదృష్టంతో ప్లేఆఫ్స్‌కు రాక…

ఢిల్లీ జట్టుతో పోలిస్తే సన్ రైజర్స్ పరిస్థితి పూర్తి విరుద్ధం. టోర్నీ మొదట్లో మెరుగైన ఆటతో టాప్‌లో నిలిచిన రైజర్స్.. ఆ తర్వాత ఆడిన ఐదు మ్యాచ్‌లలో కేవలం ఒక విజయం నమోదు చేసుకుని ప్లే‌ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తన ఆఖరి మ్యాచ్‌లో చిత్తుగా ఓడటంతో.. మెరుగైన రన్‌రేట్‌ కారణంగా రైజర్స్ ముందంజ వేసింది. ఐపీఎల్‌ చరిత్రలో 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు వచ్చిన తొలి జట్టు సన్‌రైజర్సే. ఇకపోతే లీగ్‌ దశలో సన్‌రైజర్స్ సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించిన వార్నర్‌, బెయిర్‌స్టో జట్టును వీడటం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేదే. ఈ స్థితిలో విలియమ్సన్‌ లీగ్ చివరి మ్యాచ్‌లో ఫామ్ లోకి రావడం రైజర్స్‌కు శుభపరిణామం. బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించడం.. స్పిన్నర్లు నబి, రషీద్‌ ఖాన్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే సన్ రైజర్స్ ఫైనల్‌కు సులభంగా చేరుకోవచ్చు.

ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్