Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు. మామూలుగా అయితే ఈ వర్షాలకు జనం సేదతీరేవారే! కానీ కరోనా కాలం కావడంతో వైరస్‌ వ్యాప్తి చెందుతున్న భయం వెంటాడుతోంది
  • లాక్‌డౌన్‌పై ప్రజలకు పూర్తి అవగాహన ఉండటంతో మంచి సహకారమే అందుతోందని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ తెలిపారు. అంతర్‌ రాష్ట్రాల మధ్య రాకపోకలను కట్టడి చేసేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 5 వేల కేసులు నమోదుచేశామన్నారు.
  • ఆరోగ్యసేతు యాప్‌లో కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారంతోపాటు... వ్యాధి లక్షణాలు, దగ్గర్లో ఎక్కడెక్కడ హెల్త్‌ సెంటర్స్‌ ఉన్నాయన్న సమాచాం లభిస్తుంది. వీటితోపాటు మనం కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి ప్రాంతానికి వెళ్తే అలర్ట్ వస్తుంది. అయితే కొన్నిచోట్ల ఈ యాప్‌ పనిచేయడం లేదు. దీంతో గందరగోళానికి పడిపోయిన వినియోగదారులు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వ్యాధి ప్రబలడం తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలను, అంతర్జాతీయ స్థాయిలో పాటించబడిన పద్దతులను మనం అనుసరిస్తున్నామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.

జెఠ్మలానీ మృతిపై ప్రముఖుల సంతాపం

last restpects to Ram Jethmalani, జెఠ్మలానీ మృతిపై ప్రముఖుల సంతాపం

కేంద్ర మాజీ మంత్రి, సుప్రీం కోర్టు న్యాయవాది రామ్ జెఠ్మలానీ( 95) మ‌ృతిపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.

కేంద్ర మంత్రిగా, న్యాయవాదిగా ఎన్నో సేవలందించిన రామ్ జెఠ్మలానీ మరణవార్త విని చింతిస్తున్నాను. సమాజంలో జరిగే సమస్యలపై ఆయన తాను చెప్పాలనుకున్న వాటిని ఖచ్చితంగా చెప్పగల మంచి మేథావిని కోల్పోవడం బాధాకరం అంటూ వ్యాఖ్యానించారు రాష్ట్రపతి కోవింద్. అదే విధంగా ప్రధాని నరేంద్రమోదీ తన సంతాపాన్ని తెలియజేస్తూ రామ్ జెఠ్మలానీ మనసుతో మాట్లాడే వ్యక్తి అని, ఆయన ఏదైనా నిర్భయంగా మాట్లాడగలరని, ఎమర్జెన్సీ వంటి రోజుల్లో ప్రజల స్వేచ్ఛకోసం ఆయన ఎంతోగానో పోరాడారన్నారు. ఆయనతో ఎన్నోసార్లు మాట్లాడే అవకాశ కలిగింది. ఈ బాధకరమైన సందర్భంలో ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను .. ఓం శాంతి అన్నారు అంటూ ట్వీట్ చేశారు. రామ్ జెఠ్మలానీతో తనకు ఎంతో అనుబంధముందని, రాజ్యసభ సభ్యులుగా తమ మధ్య కొన్ని సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశామని, ఆయన లేకపోవడం బాధకరంగా ఉందంటూ జెఠ్మలానీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

వీరితో పాటు అభిషేక్ సింఘ్వీ, డిల్లీ సీఎం కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, తదితరులు జెఠ్మలానీ మరణంపై తమ సంతాపాన్ని తెలిపారు.

Related Tags