టీ20ల్లో మలింగ సరికొత్త రికార్డు

శ్రీలంక పేసర్ మలింగ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న క్రికెటర్‌గా ఖ్యాతికెక్కాడు. మొత్తం 99 వికెట్లు తీసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా పాక్ బౌలర్ షాహిద్ ఆఫ్రిది పేరిట అత్యధికంగా 98 వికెట్లు తీసిన రికార్డు ఉండేది. న్యూజిలాండ్‌తో జరుగుతోన్న టీ20 మ్యాచ్‌లో కొలిన్ గ్రాండ్‌హోమ్ వికెట్ తీయడం ద్వారా మలింగ 99 వికెట్లు తీసిన క్రికెటర్‌గా నిలిచాడు. 35 ఏళ్ల మలింగ 226 వన్డేలు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు. 2007, […]

టీ20ల్లో మలింగ సరికొత్త రికార్డు
Follow us

| Edited By:

Updated on: Sep 02, 2019 | 12:29 AM

శ్రీలంక పేసర్ మలింగ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న క్రికెటర్‌గా ఖ్యాతికెక్కాడు. మొత్తం 99 వికెట్లు తీసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా పాక్ బౌలర్ షాహిద్ ఆఫ్రిది పేరిట అత్యధికంగా 98 వికెట్లు తీసిన రికార్డు ఉండేది. న్యూజిలాండ్‌తో జరుగుతోన్న టీ20 మ్యాచ్‌లో కొలిన్ గ్రాండ్‌హోమ్ వికెట్ తీయడం ద్వారా మలింగ 99 వికెట్లు తీసిన క్రికెటర్‌గా నిలిచాడు.

35 ఏళ్ల మలింగ 226 వన్డేలు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు. 2007, 2011 ప్రపంచకప్‌లో శ్రీలంక ఫైనల్‌కు చేరడంలో అతను కీలక పాత్ర పోషించాడు. తన 15 ఏళ్ల వన్డే ప్రయాణంలో ఎన్నో రికార్డులను అందుకున్నాడు. అవి ఏంటంటే..

• వన్డేల్లో మూడు సార్లు హ్యాట్రిక్‌ సాధించిన ఏకైక ఆటగాడిగా మలింగ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా, కెన్యా, ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించాడు. వీటిలో రెండు హ్యాట్రిక్‌లను ప్రపంచకప్‌లోనే సాధించడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు హ్యాట్రిక్‌లు చేసిన ఆటగాళ్లు మలింగ, వసీమ్‌ అక్రమ్‌ మాత్రమే.

• వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన బౌలర్‌ మలింగ మాత్రమే. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ అందుకోలేదు.

• ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ఆటగాడు మలింగ. అతను 29 మ్యాచుల్లో 56 వికెట్లు పడగొట్టాడు. మెక్‌గ్రాత్‌ (71), ముత్తయ్య మురళీధరన్‌ (68) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

• శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ మలింగ (338). అతని కంటే ముందు ముత్తయ్య మురళీధరన్ (523), చమింద వాస్‌ (399) ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో మలింగ 13 వికెట్లు పడగొట్టి శ్రీలంక తరఫున టాప్‌ బౌలర్‌గా నిలిచాడు.

• శ్రీలంక తరఫున బౌలింగ్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ను కలిగి ఉన్న రెండో బౌలర్‌ మలింగనే (32.4). అజంతా మెండిస్‌ తొలి స్థానంలో ఉన్నాడు.

• మలింగ బ్యాట్‌లోనూ రికార్డు సాధించాడు. శ్రీలంక తరఫున పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆటగాళ్లలో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడు మలింగనే. పదో స్థానంలో దిగిన అతను అర్ధశతకం బాదడం విశేషం.