Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 8 లక్షల 78 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 878254. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 301609. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 553471. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23174. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు . ఈరోజు, రేపు ఆదిలాబాద్, నిర్మల్ , కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు ,ఖమ్మం జిల్లాలలో భారీవర్షాలు . తెలంగాణలో సాధారణం గా చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. మరోవైపు ఒరిస్సా నుండి కోస్తా ఆంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి . - రాజారావు, హైదరాబాద్ వాతావరణ శాఖ.
  • మాస్క్ ధరించకపోతే జరిమానా. గతం లో ఉన్న జరిమానా ని పెంపు. కరోనా నేపథ్యంలో ప్రజలు మాస్క్ ధరించకపోతే జరిమానాను 200 నుండి రూ .500 కు పెంచిన గుజరాత్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ .
  • అమరావతి: వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని ఆదేశాలు జారీ చేసిన సీఎం వైయస్‌.జగన్‌ . కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష. సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసింది సున్నా అని సమావేశంలో ప్రస్తావన.
  • హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ ప్రభుత్వానికి లేఖలు. సీఎం జగన్ తో పాటు, లేఖ సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కి లేఖల హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని వినతి. హిందూపురం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని తెలిపిన బాలకృష్ణ. కర్ణాటక రాజధాని బెంగళూరు కి దగ్గరగా ఉండటంతో పాటు అనువైన స్థలం కూడా ఎక్కువగా ఉందని తెలిపిన బాలకృష్ణ.
  • అమరావతి : మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కొడుకు సురేష్ మాజీ పీఎస్ మురళీమోహన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్ట్ విచారణ. బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు. ఇప్పటికే పరారీలో ఉన్న పితానీ కొడుకు వెంకట సురేష్ వెంకట సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ అధికారులు. బెయిల్ ఇవ్వొద్దని కోర్టు కోరిన ఏసీబీ అధికారులు.

4 బంతుల్లో 4 వికెట్లు: టీ20ల్లో లసిత్ మలింగ వరల్డ్ రికార్డ్! 

Lasith Malinga rises in T20I rankings post Pallekele magic, 4 బంతుల్లో 4 వికెట్లు: టీ20ల్లో లసిత్ మలింగ వరల్డ్ రికార్డ్! 

శ్రీలంక సీనియర్ బౌలర్ లసిత్ మలింగ న్యూజిలాండ్‌తో పల్లెకెలెలో జరిగిన మూడో టీ20లో చెలరేగిపోయాడు. బుల్లెట్‌లాంటి బంతులు విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి సత్తాచాటాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్‌లో శ్రీలంక వెటరన్‌ పేసర్‌ లసిత్‌ మలింగ ఒకేసారి 20 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో మలింగ వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు సాధించడం ద్వారా ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. ప్రస్తుతం మలింగ 21వ స్థానంలో నిలిచాడు. అంతకుముందు 41 స్థానంలో ఉన్న మలింగ.. కివీస్‌పై అద్భుత ప్రదర్శన తర్వాత తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకున్నాడు. నిన్న కివీస్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించడంతో వన్డేల్లోనూ టీ20ల్లోనూ ఆ ఫీట్‌ సాధించిన తొలి బౌలర్‌గా మలింగా రికార్డు నెలకొల్పాడు.

అదే సమయంలో అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల మార్కును చేరి తొలి బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. ఇక అఫ్గాన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ తన టాప్‌ ర్యాంకును కాపాడుకున్నాడు. న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ మిచెల్‌ సాంత్నార్‌ ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని ఐదో స్థానంలో నిలిచాడు. భారత స్పిన్నర్‌ టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. భారత్‌ నుంచి టాప్‌-10లో నిలిచిన ఏకైక బౌలర్‌ కుల్దీప్‌. తాజా ర్యాంకింగ్స్‌లో కుల్దీప్‌ 8వ స్థానంలో ఉన్నాడు. ఇక బ్యాట్స్‌మెన్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌ టాప్‌ను కాపాడుకున్నాడు. అతని తర్వాత స్థానంలో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ రెండో స్థానానికి చేరగా, కొలిన్‌ మున్రో మూడో స్థానానికి పడిపోయాడు. ఇక భారత్‌ నుంచి కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలు టాప్‌-10లో నిలిచారు. రాహుల్‌7వ స్థానంలో రోహిత్‌ 9వ స్థానంలో కొనసాగుతున్నారు.

Related Tags