పాకిస్థాన్​లో క్రికెట్ ఆడలేమంటున్న శ్రీలంక ప్లేయర్స్!

Ten Sri Lankans opt out of Pakistan tour over security fears, పాకిస్థాన్​లో క్రికెట్ ఆడలేమంటున్న శ్రీలంక ప్లేయర్స్!

పాకిస్థాన్​ టూర్‌ని క్యాన్సిల్ చేసుకుంది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఈ నెలలో లంక టీం పాక్‌లో వన్డే, టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉంది. సిరీస్ ఆడేందుకు శ్రీలంక ప్లేయర్లు నిరాకరించారు. ఈ టూర్‌కు దాదాపు 10 మంది క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.  భద్రతా కారణాల దృష్ట్యా  కెప్టెన్ లసిత్ మలింగతో సహా 10 మంది ఆటగాళ్లు పాక్​లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ జాబితాలో లంక జట్టు మాజీ సారథులు ఆంజెలో మ్యాథ్యూస్, తిసారా పెరీరా ఉన్నారు.

సెప్టెంబర్ 27 నుంచి పాకిస్థాన్​లో ఆరు మ్యాచ్​లు ఆడాల్సి ఉంది శ్రీలంక. అక్టోబర్​ 9 వరకు కొనసాగే ఈ పర్యటనలో ఇందులో మూడు వన్డేలు, మూడు టీ 20లు ఉన్నాయి. 2009లో శ్రీలంక క్రికెటర్ల వాహనాలపై ఉగ్రదాడి అనంతరం పాక్​లో అంతర్జాతీయ మ్యాచ్​ ఆడలేదు ఆ దేశం. అప్పటి నుంచి యూఏఈ కేంద్రంగా పాకిస్థాన్ ఇతర దేశాలతో మ్యాచ్​లు ఆడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *