కోయంబత్తూరులో ఎన్ఐఏ సోదాలు.. లాప్‌టాప్స్, ఫోన్లు స్వాధీనం

తమిళనాడులోని కోయంబత్తూరులో ఉదయం నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున లాప్ టాప్స్, మొబైల్స్, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. కోయంబత్తూరులోని ఏకకాలంలో ఐదుచోట్లు ఎన్ఐఏ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రసంస్థ కార్యకలాపాలు, శ్రీలంకలో జరిగిన ఈస్టర్ దాడులపై ఇంకా విచారణ జరుపుతోంది. గురువారం రాష్ట్రంలో జరిగిన తనిఖీల్లో ఎన్ఐఏ అధికారులు, తమిళనాడు పోలీసులు […]

కోయంబత్తూరులో ఎన్ఐఏ సోదాలు.. లాప్‌టాప్స్, ఫోన్లు స్వాధీనం
Follow us

| Edited By:

Updated on: Aug 29, 2019 | 5:01 PM

తమిళనాడులోని కోయంబత్తూరులో ఉదయం నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున లాప్ టాప్స్, మొబైల్స్, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. కోయంబత్తూరులోని ఏకకాలంలో ఐదుచోట్లు ఎన్ఐఏ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రసంస్థ కార్యకలాపాలు, శ్రీలంకలో జరిగిన ఈస్టర్ దాడులపై ఇంకా విచారణ జరుపుతోంది. గురువారం రాష్ట్రంలో జరిగిన తనిఖీల్లో ఎన్ఐఏ అధికారులు, తమిళనాడు పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నారు. ఐఎస్ఐఎస్ సూత్రధారిగా భావిస్తున్న మహ్మద్ అజారుద్దీన్‌ను ఎన్ఐఏ అధికారులు జూన్‌లోనే అరెస్ట్ చేశారు.