విద్యార్థులకు తీపి కబురు..వారికి ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు

విద్యార్థులకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం చేయూతనందిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితుల్లో సర్కార్ తీసుకున్న నిర్ణయం అక్కడి విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని పిల్లలు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులకు తీపి కబురు..వారికి ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు
Follow us

|

Updated on: Jul 27, 2020 | 12:12 PM

విద్యార్థులకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం చేయూతనందిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితుల్లో సర్కార్ తీసుకున్న నిర్ణయం అక్కడి విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని పిల్లలు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లను అందించనున్నట్లు స్వయంగా అక్కడి ముఖ్యమంత్రి ప్రకటించారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అక్కడి విద్యార్థులకు తీపి కబురు చెప్పారు. 2019-20 విద్యాసంవత్సరంలో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందిస్తామని తెలిపారు. 12వతరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లను అందించాలని నిర్ణయించినట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. మెరిట్ విద్యార్థులు ల్యాప్ టాప్ ల కొనుగోలుకు వీలుగా 25వేల రూపాయలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీనియర్ అధికారులతో మాట్లాడారు.

ఇదిలా ఉంటే, కరోనా వైరస్ పట్ల భయాందోళనకు గురవుతున్న ప్రజలకు సీఎం కీలక సూచన చేశారు. కరోనా సోకితే భయపడకండి అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ‘నేను బాగానే ఉన్నా..ప్రాణాలుపణంగా పెట్టి కరోనా వారియర్స్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. కరోనా పేషెంట్ల కోసం పని చేస్తున్న వారందరికీ సెల్యూట్’ అంటూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!