Breaking News
  • హైదరాబాద్‌: బేగంపేటలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి. ఓ అపార్ట్‌మెంట్‌ సమీపంలో రక్తపు మడుగులో ఉన్న మృతదేహం. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.
  • నిర్మల్‌: బైంసాలో కంది రైతుల అరిగోస. ఎలాంటి సమాచారం లేకుండా కొనుగోళ్లను నిలిపివేసిన అధికారులు. ఈరోజు తేదీతో టోకెన్‌ ఇచ్చిన అధికారులు. కొనుగోలు కేంద్రానికి కందులు తీసుకొచ్చిన రైతులు. కొనుగోళ్లు లేకపోవడంతో కందులను తిరిగి తీసుకెళ్తున్న రైతులు.
  • హైదరాబాద్‌: నేరెడ్‌మెట్‌లో దారుణం. మైనర్‌ బాలికపై ఫోటోగ్రాఫర్‌ అఘాయిత్యం ఫోటోకోసం వెళ్లిన మైనర్‌ బాలికపై సలీం అత్యాచారం. అరుచుకుంటూ స్టూడియో బయటికి పరుగులు తీసిన బాలిక. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక.
  • నెల్లూరు మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. పలు శాఖలకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేస్తున్న అధికారులు.
  • భద్రాచలం సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్యాయత్నం. బాత్‌రూమ్‌ రేకుతో చేయి కోసుకున్న ప్రవీణ్‌కుమార్‌. ఆస్పత్రికి తరలించిన జైలు అధికారులు.
  • డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్‌. యాదాద్రి భువనగిరిజిల్లాః భువనగిరిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం. ప్రియుడి మృతి, ప్రియురాలి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. ఈ నెల 16న ప్రేమ వివాహం చేసుకున్న స్వామి, ఉమారాణి. వలిగొండ మండలం జంగారెడ్డిపల్లికి చెందినవారిగా గుర్తింపు.

తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు.. అజారుద్దీన్ అరెస్ట్

, తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు.. అజారుద్దీన్ అరెస్ట్

శ్రీలంక మారణకాండ మూలాలపై ఎన్ఐఏ దృష్టిసారించింది. ఈ ఘోర రక్తపాతానికి సహకరించిన వారి కోసం వేట ముమ్మరం చేసింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఏడు ప్రాంతాల్లో సోదాలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు శ్రీలంక ఆత్మాహుతి బాంబర్ జహ్రన్ హషీంకు ఫేస్‌బుక్ స్నేహితుడైన ఐసిస్ తమిళనాడు మాడ్యూల్ సూత్రధారి మొహమ్మద్ అజారుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. అతని నుంచి 14 మొబైల్ ఫోన్లు, 29 సిమ్ కార్డులు, 10 పెన్ డ్రైవ్‌లు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఆరు మెమోరీ కార్డులు, నాలుగు హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు, సీడీలు, డీవీడీలు, ఒక కత్తి ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈస్టర్ పర్వదినం సందర్భంగా శ్రీలంకలో సాగిన వరుస బాంబు పేలుళ్లలో రెండు వందల మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ పేలుళ్ల అనంతరం తమిళనాడుపై ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత నెల కోయంబత్తూర్‌లో ముగ్గురి ఇళ్లలో సోదాలు జరిపి, ల్యాప్ టాప్‌లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం 35 మందితో కూడిన అధికారుల బృందం కోయంబత్తూర్‌లో స్థానిక పోలీసులతో కలిసి ఏడు చోట్ల తనిఖీలు చేపట్టింది. ఉక్కడం అన్బునగర్‌లోని అజారుద్దీన్, పోతనూరులోని సద్దాం, అక్బర్, అక్రమ్ తిల్లా, కునియా ముత్తురులోని అబూబక్కర్ సలీం, అల్లమిన్ కాలనీలోని ఇదయతుల్లా, కరీంషా ఇళ్లలో సోదాలు జరిపారు. కోయంబత్తూరుకు చెందిన అజారుద్దీన్‌తో పాటు మరో ఐదుగురు నాయకత్వంలో నడుస్తున్నట్టుగా అనుమానిస్తున్న తమిళనాడు మాడ్యూల్ పై మే 30వ తేదీన కేసు నమోదైంది. తమిళనాడు, కేరళలలో ఉగ్రదాడులు నిర్వహించేందుకు యువతను ఆకర్శించడం వారి లక్ష్యమని వారి లక్ష్యమని ఎన్ఐఏ తెలిపింది.

Related Tags