భాష లేనిదే అస్థిత్త్వం లేదు.. ఏ భాషనూ విస్మరించొద్దు..!!

Language is every Indian's identity, భాష లేనిదే అస్థిత్త్వం లేదు.. ఏ భాషనూ విస్మరించొద్దు..!!

ఈ భారత దేశంలో అనేక భాషా సంహారాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే.. స్వాతంత్య్రం వచ్చేనాటికి.. రెండో అతిపెద్ద భాషగా.. ఎక్కువ మంది మాట్లాడే భాషగా ‘తెలుగు’ ఉండేది. కానీ.. దురదృష్టవ శాత్తూ.. కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిల వల్ల ఈ దేశంలో రెండో అతిపెద్ద భాషగా ఉండే తెలుగు భాష.. నెమ్మదిగా.. నాలుగో స్థానానికి దిగిపోయింది. పోనీ.. అన్ని భాషలూ తగ్గిపోతున్నాయంటే.. అదీ కాదు. మొదట హిందీ భాషను కేవలం 35, 34 శాతం మంది మాట్లాడేవారు. కానీ.. ఇప్పుడు విపరీతంగా.. 44, 45 శాతానికి చేరుకుంది.

హిందీ భాష.. ఇతర భాషలపై కూడా దౌర్జన్యపూరితం చేసిందనే వాదన మరాఠీ కవులు కూడా చెబుతూ ఉన్నారు. మైథిలీ, రాజస్తానీ, పహాడీ అనేక భాషలు ఏవైతే ఉన్నాయో.. ఆ భాషలను కూడా హిందీ భాషల్లో కలపివేశారు. హిందీ భాష ఒక్కటే అయినా.. సాహిత్యంగా అవి వేరు వేరుగా ఉన్నాయి. ఈ భాషను వేరు చేస్తే కనుక.. హిందీ మాట్లాడేవారి సంఖ్య తగ్గుతూ ఉంటుంది. భారత రాజ్యాంగం వ్రాసేటప్పుడు.. ముందు వీటిని పరిగణలోకి తీసుకున్నా.. ఆ తరువాత తప్పనిసరిగా.. హిందీని జాతీయ భాషగా వాడాలనుకున్నప్పుడు.. దాంతోపాటు.. ఇంగ్లీషును కూడా.. అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నప్పుడు.. దాన్ని గౌరవించడకుండా.. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఇలా చేయడం దుర్మార్గంగా భావించవచ్చు.

అదేవిధంగా.. ముఖ్యంగా మిగతా భాషను చూసుకుంటే.. తమిళం, కన్నడ, మళయాలం, తెలుగు మొత్తం కూడా ఈ భాషలన్నీ మాట్లాడేవారి సంఖ్య చూస్తే.. నిష్పత్తి అనేది పడిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. ‘మన బంగారం మంచిదైతే.. ఎవర్నీ అనాల్సిన అవసరం లేదు’ ఈ సామెతలాగ.. మన తెలుగు రాష్ట్రాలు కూడా.. అధికార భాషగా తెలుగు మాట్లాడాలని తీర్మానం చేస్తే.. ఇతర భాషలతో పాటుగా.. తెలుగు కూడా.. అంతరించిపోకుండా ఉంటుంది.

దివంగత మహానేత.. ఎన్టీ రామారావు తప్పించి.. తెలుగు భాష కోసం చిత్తశుద్ధితో పనిచేసినవారు లేరని చెప్పాలి. కేవలం కంటితుడుపు మాటలే తప్పించి.. ప్రయత్నాలు లేవు. తెలుగు భాషా సమితిని మొట్టమొదటిసారిగా దశాబ్దాల క్రితం.. అక్కినేని నాగేశ్వర్ రావు, సీ నారాయణ రెడ్డి, ప్రొఫెసర్ ఎంఎస్ రాజు, చీకూరి రామారావు తదితరులు ఈ సమితిని ఏర్పాటు చేసి.. ప్రజల్లోకి ఉధృతంగా తీసుకెళ్లారు. దక్షిణ భారతదేశంలో.. త్రిభాషా సంస్కృతితో.. తెలుగు భాషని మొత్తం నిర్లక్ష్యం చేశారు. ఇతర రాష్ట్రాల్లో.. తెలుగు మూలాలు ఉన్నవారు 40 శాతం మంది ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో.. తెలుగు భాషల్లో.. యాస వేరు కానీ.. భాష ఒక్కటే. కానీ.. ప్రజల దృష్టిలో మాత్రం.. ఏపీ తెలుగు వేరు.. తెలంగాణ భాష వేరు అనుకుంటున్నారు. అలాగే.. ఇంగ్లీషు భాష ముఖ్యమే.. ఉపాధి కొరకు.. నేర్చుకోవచ్చు.. కానీ.. మన తెలుగు భాషను మర్చిపోవద్దు. కాగా.. ప్రస్తుతం మోడీ-అమిత్‌షా కూటమిల కుట్ర ఏంటంటే.. దేశవ్యాప్తంగానే కాకుండా.. ఇతర దేశాల్లో కూడా.. హిందీ నేర్చుకోవడం ముఖ్యమంటున్నారు. ఆఖరికి.. బ్యాంకుల్లో కూడా.. తెలుగును భాషను తీసేసి.. హిందీ భాషను ప్రవేశపెడుతున్నారు. దీంతో.. ప్రజలు బాగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. హిందీకి, యూపీకి.. లిపినే లేదు. తాజాగా.. పరీక్షల్లో కూడా.. హిందీ, ఇంగ్లీషు భాషల్లో పెట్టడం వల్ల స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఏదేమైనా.. ఒక భాష నశిస్తే.. ఒక జాతి అస్థిత్త్వం నశిస్తుంది. సంస్కృతి, సంప్రదాయాలు నశిస్తాయి. ఇప్పటికైనా.. ఇతర భాషలతో పాటుగా.. సొంత భాషలను కూడా గౌరవిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *