విశాఖలో భూముల కబ్జాపై విజయసాయిరెడ్డి కీలక కామెంట్స్…వెనక్కి ఇవ్వకుంటే క్రిమనల్ కేసులే..

విశాఖలో భూముల కబ్జాపై తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గత టీడీపీ హయాంలో భూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఆక్రమించుకున్న భూములను వెంటనే...

విశాఖలో భూముల కబ్జాపై విజయసాయిరెడ్డి కీలక కామెంట్స్...వెనక్కి ఇవ్వకుంటే క్రిమనల్ కేసులే..
Follow us

|

Updated on: Dec 22, 2020 | 8:21 AM

Vijaya Sai Reddy Comments : విశాఖలో భూముల కబ్జాపై తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గత టీడీపీ హయాంలో భూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఆక్రమించుకున్న భూములను వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేయాలని సూచించారు. ఇవ్వకుంటే క్రిమినల్‌ కేసులు పెట్టి, అరెస్ట్‌ చేస్తామన్నారు. రెవెన్యూ అధికారులు కూడా భూ అక్రమాల్లో పాలు పంచుకున్నారని, రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు విజయసాయిరెడ్డి. దేవాదాయశాఖ భూములు, గడ్డలు, కుంటల రికార్డులను మార్చి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే 200, 300 గజాలు ఉన్న పేద వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని తెలిపారు విజయసాయి. అయితే భూ బకాసురులను మాత్రం వదిలిపెట్టేది లేదన్నారు.

మరోవైపు విశాఖలో ప్రభుత్వ భూములు మాత్రమే తీసుకుని రాజధాని నిర్మాణం చేపడుతున్నామన్నారు విజయసాయిరెడ్డి. ప్రజల నుంచి సెంటు భూమి కూడా తీసుకోకుండా రాజధాని నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. భూముల కబ్జాకు పాల్పడిన వారికి ఎలాంటి శిక్షలు అమలవుతాయో కూడా చెప్పారు విజయసాయిరెడ్డి. సెక్షన్‌ 466లో ఏడేళ్లకు పైగా శిక్ష పడుతుందని, సెక్షన్‌ 467 ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారందరిపై చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన ధనవంతులపై క్రిమినల్‌ కేసులు పెడతామన్నారు. దేవాదాయశాఖకు చెందిన భూములను, వెబ్‌ ల్యాండ్‌ను టీడీపీ దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ భూములను దోచుకోవడం నేరమైతే, దేవాదాయశాఖ భూములను దోచుకోవడం కూడా ఇంకా పెద్ద నేరమన్నారు విజయశాయిరెడ్డి.

మరోవైపు రెండు నెలలుగా విశాఖలోని ప్రభుత్వ భూములపై ఫోకస్‌ పెట్టారు అధికారులు. కబ్జా అయిన భూములన్నింటినీ బయటకు తీస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే.. ప్రభుత్వ భూములను కబ్జా చేశారనే ఆరోపనలున్నాయి. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కట్టించిన ఆక్రమణలను తొలగించారు అధికారులు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ 300 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేశారన్నది మరో ఆరోపణ. అయితే 30 కోట్లు ఇస్తే… తన భూమి మొత్తాన్ని ఇచ్చేస్తానని సవాల్‌ చేశారు పీలా గోవింద్‌.

Also Read : Today Gold Rates in India: పరుగు ఆపని పసిడి.. వరుసగా పెరుగుతున్న ధరలు.. నేడు బంగారం ధర ఎంతంటే..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..