బీహార్‌ మాజీ సీఎం లాలూ పరిస్థితి విషమం… రాంచీ రిమ్స్‌ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలింపు.. ఆందోళనలో ఆర్జేడీ కార్యకర్తలు

లాలూ ప్రసాద్‌యాదవ్‌ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను రాంచీ ఆస్పత్రి నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించారు

బీహార్‌ మాజీ సీఎం లాలూ పరిస్థితి విషమం... రాంచీ రిమ్స్‌ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలింపు.. ఆందోళనలో ఆర్జేడీ కార్యకర్తలు
Follow us

|

Updated on: Jan 23, 2021 | 8:33 PM

Lalu Prasad Yadav Shifted To Delhi AIIMS : దశాబ్ధాలపాటు బీహార్‌ రాజకీయాల్ని శాసించిన లాలూ ప్రసాద్‌యాదవ్‌ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను రాంచీ ఆస్పత్రి నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించారు. గత కొద్దిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న లాలూప్రసాద్‌ యాదవ్‌ రాంచీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం క్షిణిస్తూ వచ్చింది. దీంతో ఇవాళ మరింత విషమించటంతో ఎయిర్‌ అంబులెన్స్‌లో.. ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించారు.

లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు కేవలం 25 శాతం మాత్రమే పని చేస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఏ క్షణంలోనైనా ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. రాంచీ ఎయిర్‌పోర్ట్‌కు వేగంగా చేరేందుకు వీలుగా గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటుచేశారు. మరోవైపు లాలూ చిన్నకుమారుడు, బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్, లాలూ సతీమణి రబ్రీ దేవి ప్రత్యేక విమానంలో పాట్నా నుంచి రాంచీ చేరుకున్నారు. అక్కడినుంచి ఢిల్లీ వెళ్లారు.

దాణా కుంభకోణం కేసులో 2013లో లాలూ ఎంపీ పదవిపై వేటుపడింది. ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకూడదని సుప్రీంకోర్టు నిషేధం విధించింది. 2017 డిసెంబర్‌లో పశు దాణా కుంభకోణం కేసులో లాలూకి ఏడేళ్ల శిక్ష పడింది. 1991 నుంచి 1996 మధ్య కాలంలో..లాలూ సీఎంగా ఉన్న సమయంలో దమ్కా ట్రెజరీ నుంచి మూడున్నర కోట్లు అక్రమంగా డ్రా చేశారనే అభియోగం రుజువు కావడంతో శిక్ష పడింది. గత అక్టోబర్‌లో లాలూకు చైబాసా ట్రెజరీ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. దమ్కా ట్రెజరీ కేసులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. రెండేళ్ల క్రితం 2018 ఆగస్టు 30న లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.

జైల్లో ఉన్నా, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా..లాలూప్రసాద్‌యాదవ్‌ చుట్టే బీహార్‌ రాజకీయం నడుస్తోంది. బీహార్‌లో ఎన్‌డీఏ సర్కార్‌ను కూల్చడానికి జైలు నుంచే ఆర్జేడీ అధినేత లాలూ కుట్ర చేస్తున్నారని అనుమానిస్తోంది బీజేపీ. తమతో కలిసొస్తే మంత్రి పదవులిస్తామని బీజేపీ, జేడీయూ ఎమ్మెల్యేలకు లాలూ ఫోన్లు చేస్తున్నారని బీజేపీ భావించింది. స్వయానా బీహార్‌ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్‌మోదీ ఆరోపణలు గుప్పించారు. రిమ్స్‌ ఆస్పత్రి డైరెక్టర్‌కు కేటాయించిన బంగ్లాలో లాలూకు ఆశ్రయం కల్పించారని జార్ఖండ్‌ ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు లాలూ ప్రసాద్ యాదవ్. ఏడేళ్ల పాటు బీహార్‌ ముఖ్యమంత్రిగా.. ఐదేళ్లపాటు కేంద్ర రైల్వేశాఖామంత్రిగా పనిచేశారు లాలూ. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. దాణా కుంభకోణంతో రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు… భార్య రబ్రీదేవిని సీఎంని చేశారు. లాలూ తొమ్మిదిమంది సంతానంలో చిన్న కొడుకైన తేజస్వియాదవ్‌…తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆర్జేడీ భావినేతగా ఎదిగారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమికి గట్టిపోటీ ఇచ్చారు.

Read Also… జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమించిన యువతి ఆత్మహత్య.. తీవ్ర మనస్తాపంతో దుబాయ్‌లో యువకుడి బలవన్మరణం

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!