లాలూ 9 న విడుదల, మర్నాడే నితీష్ నిష్క్రమణ, తేజస్వి యాదవ్

లాలూ ప్రసాద్ యాదవ్ నవంబరు 9 న విడుదలవుతారని, ఆ మర్నాడే సీఎం నితీష్ కుమార్ వీడ్కోలు (ఓటమి) తథ్యమని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ జోస్యం చెప్పారు. (నవంబరు 10 న బీహార్ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు).

  • Umakanth Rao
  • Publish Date - 11:32 am, Sat, 24 October 20

లాలూ ప్రసాద్ యాదవ్ నవంబరు 9 న విడుదలవుతారని, ఆ మర్నాడే సీఎం నితీష్ కుమార్ వీడ్కోలు (ఓటమి) తథ్యమని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ జోస్యం చెప్పారు. (నవంబరు 10 న బీహార్ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు). తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఓ అవినీతి కేసులో ఝార్ఖండ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవలే ఆయనకు  ఆ రాష్ట్ర హైకోర్టు ఓ  కేసులో బెయిల్ మంజూరు చేయగా, . మరో అవినీతి కేసు విచారణ పెండింగులో ఉంది.

వచ్ఛేనెల 9 న లాలూజీ జైలు నుంచి విడుదల అవుతారని, ఆ రోజునే తన జన్మ దినమని తేజస్వి యాదవ్ చెప్పారు. బీహార్ లోని హిసువా లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఆయన ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. నితీష్ కుమార్ అలసిపోయారని, రాష్ట్రాన్ని పాలించే ఓపిక ఇక ఆయనకు లేదని తేజస్వి అన్నారు. అవినీతిని అదుపు చేయడంలో, యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు వలస కార్మికులు తరలకుండా నిరోధించడంలోనూ  నితీష్ వైఫల్యం చెందారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే పది లక్షల ఉద్యోగాలు ఇవ్వడం గ్యారంటీ అన్నారు తేజస్వి యాదవ్.