Breaking News
  • ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌. దిశ చట్టంపై జగన్‌ను అభినందించిన అనిల్‌ దేశ్‌ముఖ్‌. మహారాష్ట్రలో దిశ చట్టం అమలుకు పరిశీలిస్తామన్న దేశ్‌ముఖ్‌.
  • చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా పట్టుబడ్డ బంగారం. 12.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.44 కోట్లు ఉంటుందని అంచనా. మలేషియా, సింగపూర్‌ నుంచి బంగారం తరలిస్తున్నట్టు గుర్తింపు. 18 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు.
  • స్థానిక ఎన్నికల్లో పోటీపై పురంధేశ్వరి నేతృత్వంలో కమిటీ వేశాం. రాజధాని అమరావతిలోనే ఉండేలా కార్యాచరణ ప్రకటిస్తాం-కన్నా. ఎంపీల గైర్హాజరును పెద్దది చేయాల్సిన అవసరం లేదు. వారివారి వ్యక్తిగత కారణాలతో రాలేమని ముందే చెప్పారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు గురించి నాకు సమాచారం లేదు. ఈనెల 25లోగా టీఎస్‌ కొత్త అధ్యక్షుడిపై స్పష్టత వస్తుంది. -ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.
  • ఢిల్లీ: షాహిన్‌బాగ్‌లో ఆందోళనకారులతో మధ్యవర్తుల చర్చలు. ఎటూ తేలకుండానే రెండో రోజు ముగిసిన చర్చలు. ఆందోళనలు విరమించాలని షాహిన్‌బాగ్‌ వాసులను కోరిన మధ్యవర్తులు. సీఏఏను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందన్న ఆందోళనకారులు. నిరసనలు చేసుకోవచ్చు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్న మధ్యవర్తులు. లేదంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందన్న మధ్యవర్తులు.
  • ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో నేను లేను.. అది కేంద్ర నిర్ణయం. మాకు ఎవరితోనూ పొత్తు లేదు.. జనసేనతో మాత్రమే మా పొత్తు -మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి.
  • విజయవాడ: వివేకానందరెడ్డి హత్యకేసుపై హైకోర్టులో విచారణ. విచారణ సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.

గుండు బాస్‌కు లోకల్ బొక్క… చోరీ చేసింది వీరే..!!!

Lalitha Jewellery robbery case: Jewels Recovered, గుండు బాస్‌కు లోకల్ బొక్క… చోరీ చేసింది వీరే..!!!

లలితా జ్యూయలర్స్ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. ఇప్పటికే నిందుతులను  ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తూ వారి దగ్గర నుంచి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. కాగా ఇటీవలే క్రైమ్‌కి ప్రధాన సూత్రధారుడిగా భావిస్తున్న మురగన్‌ బెంగుళూరు సివిల్ కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే. తన మేనల్లుడు సురేశ్ సరెండర్ అయ్యి..కీలక సమాచారం వెల్లడించడింతో సూత్రధారి లొంగిపోక తప్పలేదు. ఇక  అతడు ఇచ్చిన సమాచారం నేపథ్యంలో..నిన్న మధురైకి చెందిన సి. గణేశన్ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి 6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా మురగన్ తాను బంగారం దాచిపెట్టిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించాడు. ఆ ప్లేసుకు మురగన్‌ను వెంటబెట్టుకెళ్లిన కాఖీలు అతడి ద్వారానే బ్యాగ్‌ను ఓపెన్ చేయించారు. కాగా ఓ నిర్మానుష్య ప్రదేశంలో గుంట తీసి అందులో బంగారం నింపిన బ్యాగును దాచిపెట్టాడు మురగన్. మురగన్‌పై గతంలో పలు బ్యాంకు రోబరీలు, దొంగతనాల ఆరోపణలు ఉన్నాయి.

ఈ నెల 2వ తేదీ రాత్రి లలిత జ్యూయలరీ దుకాణంలో మురుగన్ బ్యాచ్ బంగారు ఆభరణాలను దోచుకొన్నారు. ఈ దుకాణం వెనుక వైపు గోడను తవ్వి దొంగలు లోపలికి వ్రవేశించారు. దుకాణంలో ఉన్న రూ. 13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకొన్నారు.  ఈ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Related Tags