తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని వైఎస్సార్ కూడలిలో ఉన్న దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారు. గత 50 ఏళ్లుగా ఆ భూమి ఆక్రమణదారుల చేతుల్లోనే ఉంది. ఇటీవల దాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవాలని భావించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని వైఎస్సార్ కూడలిలో ఉన్న దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారు. గత 50 ఏళ్లుగా ఆ భూమి ఆక్రమణదారుల చేతుల్లోనే ఉంది. ఇటీవల దాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవాలని భావించారు. ఆ స్థలంలోనే ఉన్న పాడుబడ్డ లక్ష్మీ థియేటర్ను శనివారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూల్చడానికి యత్నించారు. ఆక్రమణదారుల్లో ఒకరైన నున్న చంద్రావతి అనే మహిళ.. థియేటర్ను కూలగొడితే ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలన్మరణానికి పాల్పడతానని బెదిరించింది. అక్కడే ఉన్న రాజానగరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
అనంతరం థియేటర్ బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించిన దేవాదాయ శాఖ అధికారులు.. లోపల కనిపించిన దృశ్యం చూసి కంగుతిన్నారు. మూడు లోతైన గోతులు.. వాటి చుట్టూ పువ్వులు, నిమ్మకాయలు, కత్తి, రక్తపు చారలు..పెద్ద ఎత్తున క్షుద్ర పూజలు సెట్టింగే ఉంది. గుప్తనిధులు ఉంటాయనే ఆశతో ఈ పనులు చేసి ఉంటారని దేవాదాయ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం జేసీబీ సాయంతో థియేటర్ను కూల్చివేశారు.