Breaking News
  • నెల్లూరు: సైదాపురం తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ సస్పెన్షన్‌. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చంద్రశేఖర్‌తో పాటు.. వీఆర్‌వోతో, తహశీల్దార్‌ ఆఫీస్‌ ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌.
  • టీవీ9కు అవార్డుల పంట. ఎక్సేంజ్‌ ఫర్‌ మీడియా న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అవార్డుల్లో.. టీవీ9కు మూడు అవార్డులు. పుల్వామా దాడి కవరేజ్‌కు బెస్ట్ న్యూస్ కవరేజ్ అవార్డు అందుకున్న.. విజయవాడ బ్యూరో చీఫ్‌ హసీనా. మరో రెండు విభాగాల్లో టీవీ9కు అవార్డులు. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ కార్యక్రమానికి.. సౌత్‌ ఇండియాలోనే బెస్ట్‌ యాంకర్‌గా రజినీకాంత్‌కు అవార్డు. టీవీ9 టాస్క్‌ఫోర్స్‌ బ్లాక్‌మ్యాజిక్‌ కార్యక్రమానికి మరో అవార్డు. అద్రాస్‌పల్లిలోని 'చితిపై మరో చితి' బాణామతి కథనానికి.. బెస్ట్‌ లేట్‌ ప్రైమ్‌టైం షో అవార్డు.
  • కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన కేంద్రం. స్థానికుల ప్రయోజనాలను కాపాడుతామని హామీ. త్వరలో ప్రత్యేక హోదా స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తాం -కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌.
  • రామానాయుడు స్టూడియోలో ప్రెషర్‌ కుక్కర్‌ సినిమా చూసిన కేటీఆర్‌. ప్రెష్‌ ఎనర్జీ, మంచి మెసేజ్‌తో సినిమా ఉంది. డాలర్‌ డ్రీమ్స్‌ కోసం అందరూ అమెరికాకు పరుగులు పెడుతున్నారు. కథలోని కంటెంట్‌ను అందరికీ అర్ధమయ్యేలా సినిమా తీశారు-మంత్రి కేటీఆర్‌.
  • తూ.గో: కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో విద్యుత్‌షాక్‌తో మామిడి శ్రీను అనే వ్యక్తి మృతి.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 56,837 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు.

‘జంబలకిడిపంబ’ హీరో రాజేంద్రప్రసాద్ – మంచు లక్ష్మీ

Lakshmi Manchu Trolls In Social Media, ‘జంబలకిడిపంబ’ హీరో రాజేంద్రప్రసాద్ – మంచు లక్ష్మీ

‘నాకు నా డైలాగ్‌లే గుర్తు ఉండవు.. మా నాన్నగారి డైలాగ్‌లా.. కెవ్వూ’ అనే కేకతో మొదలైన మంచు లక్ష్మీ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గత శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు హాజరైన మంచు లక్ష్మీ స్పీచ్‌పై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పంచ్‌లు పేలుస్తున్నారు. .

మంచు లక్ష్మీ మాట్లాడుతూ… ‘నా తరువాత మాట్లాడేవాళ్లు చాలా మంది ఉన్నారు. అందువల్ల ఇంగ్లీష్‌లో మాట్లాడితేనే తొందరగా మాట్లాడగలను. తెలుగు అంటే రోజంతా పడుతుంది. (ఈలోపు ఆడియన్స్ తెలుగులోనే మాట్లాడని కేకలు వేయగా). ఏంటీ.. తెలుగులోనే మాట్లాడాలా? చచ్చారు పోండి.. అయితే తెలుగులోనే మాట్లాడతాను. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ బెస్ట్ విషెష్’. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ అంకుల్.. (తలవంచి నమస్కారం పెడుతూ..) ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. మనోజ్ ఉండి ఉంటే.. కేవలం ఆయన గురించే మాట్లాడేవాడు. ఎందుకంటే ‘జంబలకిడిపంబ’ సినిమా వందసార్లు కాదు కదా.. 150, 1000 సార్లుకు పైగా ఆ క్యాసెట్‌ అరిగేదాకా స్కూల్ కాగానే ఆ సినిమానే చూసేవాళ్లం. దీంతో పాటు ‘ఏప్రిల్ 1 విడుదల’ ఇలా ఎన్నో మంచి సినిమాలతో అలరించారని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ఈ మంచు లక్ష్మీ స్పీచ్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ‘జంబలకిడి పంబ’ సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్ అయితే.. నరేష్ ఎవరమ్మా.? మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దు మంచు అక్కా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Tags