పేద బ్రాహ్మణుడి ఇంట గుట్టల కొద్దీ కరెన్సీ కట్టలు..

తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని ఓ వృద్ధ బ్రహ్మణుడి ఇంట గుట్టల కొద్దీ కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఆ నోట్ల కట్టలను లెక్కించేందుకు ఏకంగా నగదు లెక్కింపు మిషన్‌ తెచ్చి మరీ డబ్బు కౌంట్‌ చేశారు..స్థానిక ముత్తిలింగం గారి వీధిలో అప్పల సుబ్రహ్మణ్యం అనే పేద బ్రాహ్మణుడి అనారోగ్యంతో మంగళవారం మృతిచెందాడు. పౌరోహిత్యం చేసుకుంటూ ఒంటరిగానే నివసిస్తున్నాడు. అతడు నివసిస్తున్న ఇళ్లు పూర్తిగా పాడుబడిపోయింది. ఆ ఇంట్లో కనీసం కరెంటు కూడా లేదు.  సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు చేసిన […]

పేద బ్రాహ్మణుడి ఇంట గుట్టల కొద్దీ కరెన్సీ కట్టలు..
Follow us

|

Updated on: Aug 29, 2019 | 11:47 AM

తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని ఓ వృద్ధ బ్రహ్మణుడి ఇంట గుట్టల కొద్దీ కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఆ నోట్ల కట్టలను లెక్కించేందుకు ఏకంగా నగదు లెక్కింపు మిషన్‌ తెచ్చి మరీ డబ్బు కౌంట్‌ చేశారు..స్థానిక ముత్తిలింగం గారి వీధిలో అప్పల సుబ్రహ్మణ్యం అనే పేద బ్రాహ్మణుడి అనారోగ్యంతో మంగళవారం మృతిచెందాడు. పౌరోహిత్యం చేసుకుంటూ ఒంటరిగానే నివసిస్తున్నాడు. అతడు నివసిస్తున్న ఇళ్లు పూర్తిగా పాడుబడిపోయింది. ఆ ఇంట్లో కనీసం కరెంటు కూడా లేదు.  సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు చేసిన అనంతరం ఇల్లు శుభ్రం చేసే నేపథ్యంలో బయటపడ్డ నోట్ల కట్టలను చూసి అందరూ అవాక్కయ్యారు. పదుల సంఖ్యలో డబ్బుల మూటలు..అందులో వందలు, యాభై, పదుల నోట్లు చూసి ఆశ్చర్యపోయారు. బ్రాహ్మణ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కౌంటింగ్‌ మిషిన్‌ ద్వారాఆ డబ్బు లెక్కించారు. దాదాపు 5 లక్షలు దాటింది. బుధవారం మధ్యహ్నం నుంచి ఇంకా కౌంటింగ్‌ కొనసాగుతోంది. అయితే, ఈ మొత్తం సొమ్మును పేద బ్రాహ్మణ సంఘం సంక్షేమానికి ఖర్చు చేస్తామని మృతుడి కుమారుడు వివరించారు.