మానవత్వాన్ని చాటుకున్న లక్షలాది మంది భక్తులు!

ఒడిషాలోని పూరీ జగన్నాథ్ రథయాత్ర జులై 4 న జరిగిన విషయం రెలిసిందే. పూరీలో జగన్నాథ్ రథయాత్ర కన్నుల పండుగలా జరిగింది. లక్షల మంది భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పూరీ జగన్నాథుడి రథయాత్రను అంగరంగ వైభవంగా జరుపుతారు. అయితే… ఈసారి జరిగిన జగన్నాథుడి రథ యాత్రలో ఓ అద్భుతమైన ఘటన చోటు చేసుకున్నది. లక్షల మంది భక్తుల మధ్య జగన్నాథుడు ఊరేగుతుండగా.. సడెన్‌గా అంబులెన్స్ సైరన్ వినిపించింది. వెంటనే లక్షల మంది జనం అడ్డుతప్పుకోగా… […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:59 pm, Mon, 8 July 19

ఒడిషాలోని పూరీ జగన్నాథ్ రథయాత్ర జులై 4 న జరిగిన విషయం రెలిసిందే. పూరీలో జగన్నాథ్ రథయాత్ర కన్నుల పండుగలా జరిగింది. లక్షల మంది భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పూరీ జగన్నాథుడి రథయాత్రను అంగరంగ వైభవంగా జరుపుతారు. అయితే… ఈసారి జరిగిన జగన్నాథుడి రథ యాత్రలో ఓ అద్భుతమైన ఘటన చోటు చేసుకున్నది. లక్షల మంది భక్తుల మధ్య జగన్నాథుడు ఊరేగుతుండగా.. సడెన్‌గా అంబులెన్స్ సైరన్ వినిపించింది. వెంటనే లక్షల మంది జనం అడ్డుతప్పుకోగా… 1200 మంది వాలంటీర్లు కొన్ని గంటల పాటు కష్టపడి.. అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం మానవ హారంలా నిలబడ్డారు. దీంతో అంబులెన్స్ లక్షలాది భక్తుల మధ్య నుంచి దూసుకెళ్ళింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.