బ్రేకింగ్: లగడపాటి సర్వే సన్యాసం

Lagadapati Rajagopal says he wont do surveys in future, బ్రేకింగ్: లగడపాటి సర్వే సన్యాసం

ఆంధ్ర ఆక్టోపస్‌గా పేరుపొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను సర్వేలు చేయబోనని ప్రకటించారు. వరుసగా రెండు సార్లు తన సర్వేలు విఫలం కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.  దీనికి సంబంధించి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

‘ప్రజానాడి పసిగట్టడంలో రెండుసార్లు విఫలం అయినందుకు గాను ఇకముందు సర్వేలకు దూరంగా ఉండదలుచుకున్నాను.’ అని ఆ ప్రకటలో పేర్కొన్నారు. ఆర్జీ ఫ్లాష్ టీమ్ పేరుతో లగడపాటి రాజగోపాల్ నిర్వహించిన సర్వేలు.. అసలు ఫలితాలకు దగ్గరగా ఉండేవి. దీంతో లగడపాటి రాజగోపాల్ సర్వేలు అంటే క్రేజ్ ఉండేది. అయితే, 2018 తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో ఆయన చెప్పిన లెక్కలు తారుమారు అయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ – టీడీపీ మహాకూటమి ప్రభుత్వంలోకి వస్తుందని లగడపాటి చెప్పారు. అయితే, ఆఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 117 సీట్లకు గాను 88 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఏపీ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. లగడపాటి సర్వే అట్టర్ ప్లాప్ అయ్యింది. టీడీపీకి 100కు ఒక పది సీట్లకు అటూ, ఇటూగా వస్తాయని, వైసీపీకి 70 సీట్లు వరకు రావొచ్చని అంచనా వేశారు. కానీ, వైసీపీ  సంచలన విజయం నమోదు చేసింది. 151 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. టీడీపీకి 23, జనసేనకు ఒక సీటు వచ్చాయి. వరుసగా ఆయన సర్వేలు విఫలం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. దీంతో ఇకపై తాను సర్వేలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.

Lagadapati Rajagopal says he wont do surveys in future, బ్రేకింగ్: లగడపాటి సర్వే సన్యాసం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *