వాలంటీర్‌కు వీడియోల పేరుతో వేధింపులు! భర్తతో కలిసి ఆందోళన

కృష్ణా జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ కుటుంబంతో కలిసి రోడ్డెక్కింది. తమ మాట వినికపోతే ఉద్యోగం నుంచి తీసివేస్తామని కొందరు నేతలు బెదిరిస్తున్నారని ఆందోళనకు దిగారు.

వాలంటీర్‌కు వీడియోల పేరుతో వేధింపులు! భర్తతో కలిసి ఆందోళన
Follow us

|

Updated on: Sep 08, 2020 | 6:36 PM

కృష్ణా జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ కుటుంబంతో కలిసి రోడ్డెక్కింది. తమ మాట వినికపోతే ఉద్యోగం నుంచి తీసివేస్తామని కొందరు నేతలు బెదిరిస్తున్నారని ఆందోళనకు దిగారు. మైలవరం మండలం తారకరామానగర్ ప్రాంతంలో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న మహిళ కుటుంబంతో కలిసి పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

వ్యక్తిగత స్వార్థంతో వేరెవరికో లబ్ది చేకూర్చడం కోసం తనను కొంతమంది టార్గెట్ చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత వాలంటీర్, తన భర్త బిడ్డతో కలిసి పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది. వారి వేధింపులకు కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. తనకు న్యాయం చేయాలని సదరు వాలంటీర్ వేడుకుంది. ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి తాము డబ్బులు తీసుకున్నామనే ఆరోపణలను చేస్తూ.. తమ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. పలువురి పేర్లను చెబుతూ బాధితులు ఆరోపణలు చేశారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు.

బాధితురాలి కుటుంబం రోడ్డుపై ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ స్ధంబించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వాలంటీర్‌కు హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబీకులు ఆందోళన విరమించి వెనుదిరిగారు.