Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌.. లేడీ సూపర్ స్టార్ అదిరిపోయే ట్వీట్!

Nayanthara's strong statement on Disha rape case, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌.. లేడీ సూపర్ స్టార్ అదిరిపోయే ట్వీట్!

దిశ అత్యాచారం, హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. ముఖ్యంగా ఈ సంఘటనపై సినీ తారలు.. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార స్పందించింది. `అన్యాయం జరిగిన వెంటనే న్యాయం జరిగితేనే అది సరైంది (Justice Is Good When Served Hot)’ అని ఎన్‌కౌంటర్‌పై ఓ ప్రకటన విడుదల చేశారు నయనతార. తెలంగాణ పోలీసులు నిజమైన హీరోలని కొనియాడారు. మన ఇళ్లలోని మగ పిల్లల్ని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించాలి. ఈ ప్రపంచాన్ని మహిళలకు సురక్షితంగా మార్చిన వాడే అసలైన మగాడు అని తెలియజేయాలి` అని నయనతార స్పష్టంచేశారు.

Nayanthara's strong statement on Disha rape case, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌.. లేడీ సూపర్ స్టార్ అదిరిపోయే ట్వీట్!

08/12/2019,12:29PM