స్టార్ హీరోయిన్ నయనతారకు కొత్త కష్టాలు!

Lady Superstar, స్టార్ హీరోయిన్ నయనతారకు కొత్త కష్టాలు!

లేడీ సూపర్‌స్టార్… దక్షిణాదిలో టాప్ హీరోయిన్ నయనతార…ఇప్పటికీ తమిళ సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’లో కథానాయికగా నటిస్తోంది. మరోవైపు తమిళంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది. పారితోషికంలోనూ తన సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరోయిన్‌కు ప్రస్తుతం కొత్త తలనొప్పి మొదలయింది.

నటిగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా… సక్సెస్ రేటింగ్ పడిపోవడమే ఆమెను ఆందోళనకు గురిచేస్తోంది. నిజానికి ఈ సంచలన నటి సక్సెస్‌ను చూసి చాలా కాలమే అయింది. ఇటీవలే విడుదలైన ‘ఐరా’, ‘మిస్టర్ లోకల్’ చిత్రాలు నయనతారను పూర్తిగా నిరాశపరిచాయి. తాజాగా ఈ భామ నటించిన చిత్రం ‘కొలైయుధీర్ కాలం’ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆమెకు సమస్యలు మొదలయ్యాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వరకూ వచ్చిన ‘కొలైయుధీర్ కాలం’ ఆడియో వేడుకలో సీనియర్ నటుడు రాధారవి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపింది.

కాగా… ‘కొలైయుధీర్ కాలం’ టైటిల్ సమస్యతో ఈ చిత్ర విడుదలపై కోర్టు తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఇదంతా నటి నయనతారకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఐతే ఈ చిత్రం హిందీలో ‘ఖామోషి’ పేరుతో విడుదలై… బాలీవుడ్‌లో డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్ర ఫలితాన్ని చూసి నయనతారకు బెంగ పట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *