ఇండో-చైనా దళాల ఘర్షణ.. ఇరు దేశాల మధ్య ముగిసిన చర్చలు..

భారత్, చైనా మిలటరీల మేజర్ల మధ్య దాదాపు ఆరు గంటల పాటు సాగిన చర్చలు ముగిశాయి. రెండు దేశాల ఆర్మీ మేజర్లు గాల్వన్ లోయలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇవాళ మరోసారి చర్చించారు.

ఇండో-చైనా దళాల ఘర్షణ.. ఇరు దేశాల మధ్య ముగిసిన చర్చలు..
Follow us

|

Updated on: Jun 18, 2020 | 8:33 PM

భారత్, చైనా దళాల మేజర్ జనరల్స్ స్థాయిలో దాదాపు ఆరు గంటల పాటు సాగిన చర్చలు ముగిశాయి. రెండు దేశాల ఆర్మీల మధ్య గాల్వన్ లోయలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై గత రెండు రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ మరోసారి ఇదే విషయంపై చర్చించారు. తూర్పు లదాఖ్‌లోని గాల్వన్ లోయలో దళాలను ఉపసంహరించడం, పరిస్థితులను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడంపై సుదీర్ఘ చర్చలు జరిపారు.

గాల్వన్ వ్యాలీలో సోమవారం సాయంత్రం భారత్, చైనా దళాల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనలో ఒక కల్నల్, 19 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. కాగా, గాల్వన్ లోయ సమీపంలో మంగళవారం, బుధవారం ఇరుదేశాల మధ్య చర్చలు ప్రతిష్టంభనతో ముగిసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈరోజు జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్న దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు.!

సుశాంత్ ఓ క్రేజీ జీనియస్.. బాలీవుడ్‌నే అతను దూరం పెట్టాడు..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి వయోపరిమితి పెంపు..!

దేశంలో మళ్లీ లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని..

బ్రేకింగ్: ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ అద్భుత విజయం..